దోమల నివారణకు భూగర్భ మురుగునీటి కాలువలకు (Drainage) దోమతెరలు. కొత్త ఐడియా అంటే ఇదేనేమో.. వైరల్ అవుతున్న వీడియో..!!!

చెన్నై కార్పొరేషన్‌లో సుమారు 4000 కోట్ల ఖర్చుతో వర్షపు నీటి కాల్వల పనులు చేపట్టినట్లు సమాచారం.

ఈ క్రమంలో దోమల బెడదను అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కార్పొరేషన్ సిబ్బంది భూగర్భ మురుగునీటి కాలువలకు (Drainage) దోమతెరలు వేసి మూసివేసిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా దోమలు ఎక్కువగా భూగర్భ మురుగునీటి కాలువల నుండే వస్తాయని చెబుతుంటారు.

అందుకే సిబ్బంది డ్రైనేజీ మూతను తీసి, దానిపై ఒక దోమతెరను ఉంచి, ఆపై తిరిగి ఇనుప మూతతో మూసివేశారు. ఇలా దోమతెర వేస్తే లోపల నుండి దోమలు బయటకు రావట. ఈ వింత పనిని నేరుగా చూసిన స్థానిక ప్రజలు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. గతంలో వైగై డ్యామ్‌లో నీరు ఆవిరి కాకుండా అప్పటి మంత్రి సెల్లూర్ రాజు థర్మాకోల్ షీట్లు వేసిన ఘటన తమిళనాడు వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ఇక్కడ గమనార్హం.


Posted

in

by

Tags: