రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన 18 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 870 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. భారత్లో మాత్రమే 500 కోట్లు దాటి రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి అక్షయ్ ఖన్నా (రెహమాన్ డకైత్) అసలైన హీరోగా నిలిచారు. అయితే, 19 మార్చి 2026న విడుదల కానున్న ‘ధురంధర్ 2’లో కథా రీత్యా ఈ ఐదుగురు నటులు కనిపించరు.
పార్ట్ 2లో కనిపించని ఆ 5 పాత్రలు ఇవే:
- నవీన్ కౌశిక్ (డోంగా): సినిమాలో రెహమాన్ డకైత్ కు కుడిభుజంగా, రక్షణ కవచంలా ఉండే పాత్ర డోంగా. క్లైమాక్స్ సీన్లో పోలీసులను ఒంటరిగా అడ్డుకుని, వీరోచితంగా పోరాడి మరణిస్తాడు. కాబట్టి పార్ట్ 2లో ఇతను ఉండడు.
- రుహుల్లా గాజీ (స్యాహి): రెహమాన్ గ్యాంగ్ సభ్యుడైన స్యాహి పాత్ర సినిమాలో కాస్త ఫన్నీగా ఉన్నా, చివర్లో రణవీర్ సింగ్ (హంజా) చేతిలో చంపబడతాడు. దీంతో ఈ పాత్ర కూడా ముగిసింది.
- హితుల్ పూజారా (నయీమ్ బలోచ్): రెహమాన్ డకైత్ పెద్ద కొడుకు పాత్ర ఇది. ఇతని మరణం చుట్టూనే సినిమా కథ మలుపు తిరుగుతుంది. ఇతని పాత్ర మొదటి భాగం ప్రారంభంలోనే ముగిసిపోతుంది.
- ఆసిఫ్ అలీ హైదర్ ఖాన్ (బాబు డకైత్): రెహమాన్ డకైత్ తండ్రి పాత్ర ఇది. తన కొడుకు మరణానికి తన తండ్రే కారణమని తెలుసుకున్న రెహమాన్, తన తండ్రిని రళ్లతో కొట్టి చంపేస్తాడు. కాబట్టి ఇతను కూడా సీక్వెల్లో ఉండడు.
- అక్షయ్ ఖన్నా (రెహమాన్ డకైత్): మొదటి పార్ట్ కి అసలైన ప్లస్ పాయింట్ అక్షయ్ ఖన్నా నటన. అయితే మొదటి భాగం ముగింపులో రెహమాన్ పాత్ర అంతమవడంతో, అక్షయ్ ఖన్నా పార్ట్ 2లో కనిపించరు.
