“నడిరోడ్డుపై కారు ఆపి గొడవకు దిగిన వ్యక్తి..!” ఎలాంటి కంగారు పడకుండా ఎస్కేప్ అయిన డ్రైవర్.. రోడ్ రేజ్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఇతన్ని చూసి నేర్చుకోండి.. వైరల్ వీడియో..!!

నోయిడాలో జరిగిన ఓ రోడ్ రేజ్ ఘటనలో, ఒక డ్రైవర్ ఏమాత్రం భయాందోళనకు గురికాకుండా సమయస్ఫూర్తితో కారును నడుపుకుంటూ అక్కడి నుంచి తప్పించుకున్న డాష్ క్యామ్ (Dashcam) వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అభిషేక్ జలాన్ అనే ఎక్స్ (X) యూజర్ పంచుకున్న ఈ వీడియోలో.. ఒక కారు రాంగ్ రూట్‌లో వచ్చి మరో కారును వెంబడించడం, అకస్మాత్తుగా బ్రేక్ వేసి దారికి అడ్డంగా నిలపడం స్పష్టంగా రికార్డ్ అయింది.

ఆ తర్వాత ఆ కారులోంచి దిగిన వ్యక్తి, కోపంగా అవతలి డ్రైవర్ వైపు రావడం మొదలుపెట్టాడు. కానీ, ఆ డ్రైవర్ కంగారుపడి బయటకు రాకుండా, కారు తలుపులు లాక్ చేసుకుని అప్రమత్తంగా ఉన్నాడు.

ఎదురుగా వచ్చిన వ్యక్తితో ఎలాంటి గొడవకు దిగకుండా, తన కారును ముందుకు తీసుకెళ్లేందుకు సరైన గ్యాప్ దొరకగానే, అతను సురక్షితంగా అక్కడి నుంచి కారును నడుపుకుంటూ తప్పించుకున్నాడు.

ఈ వీడియోను ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేసిన ఆ యూజర్, నోయిడా మరియు ఉత్తరప్రదేశ్ పోలీసులను ట్యాగ్ చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. క్లిష్ట పరిస్థితిలో కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా వ్యవహరించి తనను తాను కాపాడుకున్న ఆ డ్రైవర్ సమయస్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Posted

in

by

Tags: