నడిరోడ్డుపై మహిళ బట్టలు చింపి.. కామాంధుల వికృత చేష్టలు; వీడియో వైరల్‌ కావడంతో దేశవ్యాప్తంగా కలకలం..!!

బీహార్‌ రాష్ట్రం నలందలో, కిరాణా షాపుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న ఒక మహిళను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డుకుని, ఆమె బట్టలు చింపి, అర్ధనగ్నంగా చేసి వేధించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

నలంద జిల్లా అజయ్‌పూర్ గ్రామంలో మార్చి 26వ తేదీ సాయంత్రం ఈ ఘటన జరిగింది. బాధితురాలు సాయంత్రం వేళ కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా, అక్కడ మాటువేసిన ఒక గుంపు ఆమెను చుట్టుముట్టి అఘాయిత్యానికి ప్రయత్నించింది.

ఆ మహిళ కేకలు వేస్తూ ప్రతిఘటించడంతో ఆగ్రహం చెందిన ఆ దుండగులు, ఆమె బట్టలు చింపివేసి, అర్ధనగ్నంగా మార్చి దాడి చేశారు. అంతేకాకుండా, ఆమెను వేధిస్తూ ఆ అవమానకరమైన దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు.

మహిళ కేకలు విని గ్రామస్థులు అక్కడికి చేరుకోవడంతో ఆ గుంపు పారిపోయింది. పారిపోయిన నిందితులు తాము తీసిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక బృందం నిందితుల కోసం గాలింపు చేపట్టింది. వీడియో ఆధారంగా ప్రధాన నిందితులైన అశోక్ యాదవ్, మత్లు మహతో (అలియాస్ నవనీత్ కుమార్) లను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

ఈ కేసులో సంబంధం ఉన్న రవికాంత్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. “మహిళల గౌరవానికి భంగం కలిగించే ఎవరినీ చట్టం వదిలిపెట్టదు. పరారీలో ఉన్న వ్యక్తిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం; అతనిపై కఠిన చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటాం” అని నలంద పోలీసులు తమ అధికారిక ఎక్స్ (X) ఖాతాలో తెలిపారు.


Posted

in

by

Tags: