“నన్ను కాపాడండి డాక్టర్ గారూ.. పాము కరిచింది..!”: ఆసుపత్రికి పరుగులు తీసిన యువకుడు.. కానీ అతను డబ్బాలో తెచ్చిన దాన్ని చూసి డాక్టర్లే హడలిపోయారుగా..!

ఒడిశాలోని భద్రక్ జిల్లాలో పాము కాటుకు గురైన ఒక యువకుడు, తనను కరిచిన అదే పామును పట్టుకుని ఆసుపత్రికి తీసుకొచ్చిన విచిత్ర ఘటన తీవ్ర కలకలం రేపింది.

చికిత్స కోసం వచ్చిన యువకుడి చేతిలోని ప్లాస్టిక్ డబ్బాలో బతికున్న పామును చూసి ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

భద్రక్ జిల్లాకు చెందిన విజయ్ జెనా అనే యువకుడు సాయంత్రం వేళ తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో అతనికి ఒక విషపాము కరిచింది. సాధారణంగా పాము కాటు వేస్తే నేరుగా ఆసుపత్రికి పరుగులు తీస్తారు. కానీ విజయ్ చేసిన పని అక్కడున్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

తనను కరిచిన పామును ప్రాణాలతో పట్టుకున్న విజయ్, దాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో బంధించాడు. ఆ తర్వాత ఆ పాము డబ్బాను చేతబట్టుకుని చికిత్స కోసం సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కి వెళ్లాడు. డబ్బా లోపల సజీవంగా ఉన్న పామును చూసి వైద్య సిబ్బంది, స్థానికులు హడలిపోయారు.

ఆసుపత్రిలో విజయ్‌కు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అతన్ని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పాము కాటు వేసినప్పటికీ, ఏమాత్రం బెదరకుండా ఆ పామునే పట్టుకుని ఆసుపత్రికి వచ్చిన ఆ యువకుడి ఉదంతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *