“నన్ను దయచేసి వదిలేయండి, కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటాను”!. నకిలీ అటవీశాఖ అధికారులుగా వచ్చిన ముఠా!.. గుండెలను పిండేసే వీడియో ఆధారంతో కలకలం.!!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్ జిల్లాలోని దేవాంగనా లోయ ప్రాంతంలో, వైద్య విద్య కోసం సిద్ధమవుతున్న 19 ఏళ్ల నీట్ విద్యార్థినికి జరిగిన దారుణ ఘటన మొత్తం దేశం గుండెలను పిండేసింది.

ఆమె తన స్నేహితుడితో కలిసి ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్లి సోషల్ మీడియా కోసం వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో, అక్కడకి వచ్చిన ముగ్గురు దారుణమైన వ్యక్తులు, తాము అటవీశాఖ అధికారులమని అబద్ధం చెప్పి బెదిరించారు.

అనంతరం విద్యార్థిని స్నేహితుడిపై దాడి చేసి, గుడ్డతో కాళ్లు చేతులు కట్టేసి, ఆ యువతిని దట్టమైన పొదల ప్రాంతానికి ఈడ్చుకెళ్లి అమానుషంగా సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఈ ఘోరమైన ఘటన సమయంలో, “నన్ను దయచేసి వదిలేయండి, కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటాను” అని ఆ యువతి కన్నీళ్లతో రోదించినప్పటికీ, ఏమాత్రం కనికరం లేకుండా నేరస్థులు తమ దారుణానికి ఒడిగట్టారు. అంతేకాకుండా, ఆ భయాందోళనకరమైన క్షణాలను తమ మొబైల్ ఫోన్లలో వీడియో రికార్డ్ చేసి, పోలీసుల వద్దకు వెళ్తే దీన్ని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు.

నేరస్థులు పారిపోయిన తర్వాత తేరుకున్న ఆ యువకుడు, అటవీ ప్రాంతంలో సరిగ్గా ఫోన్ సిగ్నల్స్ లేనప్పటికీ కొండపై నుండి కిందకు పరిగెత్తుకొచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు విద్యార్థినిని, ఆమె స్నేహితుడిని రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు.

తీవ్రంగా విచారణ ప్రారంభించిన పోలీసులు నేరస్థులను గుర్తించి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా, నేరస్థులలో ఒకడైన జితేంద్ర పటేల్ అనే వ్యక్తి పోలీసులపై తుపాకీతో కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ గాయపడినప్పటికీ, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో (ఎన్‌కౌంటర్‌లో) నేరస్థుడి కాలిలోకి బుల్లెట్ దిగి తీవ్రంగా గాయపడటంతో అతడిని వెంటనే అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నేరస్థులపై రూ. 50,000 చొప్పున పారితోషికం ప్రకటించి వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *