“నన్నే ఎదిరించి మాట్లాడతావారా?.” పరీక్ష పేపర్ వివాదంలో విద్యార్థిపై మూకదాడి.. ఒళ్లు గగుర్పొడిచే సీసీటీవీ దృశ్యాలు.. హైదరాబాద్‌లో కలకలం.!

హైదరాబాద్ పాతబస్తీ సంతోష్‌నగర్ పరిధిలోని నారాయణ జూనియర్ కళాశాల బ్రాంచ్‌లో, పరీక్ష పేపర్ విషయంలో ఇద్దరు బాలుర మధ్య మొదలైన చిన్న వివాదం చివరకు రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.

ఈ వివాదం మరింత ముదిరి, ఇండో-ఇంగ్లీష్ 7B గ్రౌండ్ వద్ద సయ్యద్ నోమన్ అనే విద్యార్థిపై ఓ గుంపు విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టారు.


Posted

in

by

Tags: