మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది.
అక్కడి ఓ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల మైనర్ విద్యార్థి, తన తండ్రి మరణం అనంతరం సవతి తల్లి చేత తీవ్ర మానసిక, శారీరక వేధింపులకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తండ్రి మరణించిన తర్వాత బాలుడి భవిష్యత్, భద్రతను దృష్టిలో పెట్టుకుని కుటుంబ సభ్యులు అతని బాధ్యతను సవతి తల్లికి అప్పగించారు. అయితే, ఆమె బాలుడిని తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని పదేపదే బలవంతం చేస్తూ తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాలుడు ఆమె డిమాండ్లను నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన సవతి తల్లి అతడిని దూషిస్తూ, కొట్టి హింసించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ వేధింపులతో తీవ్ర భయాందోళనకు గురైన బాలుడు చివరకు అక్కడి నుంచి తప్పించుకుని తన అత్త ఇంటికి వెళ్లి తనకు జరిగిన విషయాన్ని వివరించాడు.
దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన బంధువులను కూడా ఆ మహిళ అసభ్య పదజాలంతో దూషించి బెదిరించినట్లు సమాచారం.
దీంతో ఆలస్యం చేయకుండా ఆ విద్యార్థి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన సవతి తల్లిపై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
