“నాన్న, నాకు పీరియడ్స్ (నెలసరి) ఉన్నాయి..” అని వేడుకున్నా కరగని తండ్రి మనసు – 5 వేల కోసం కూతురిని అమ్మేసిన వైనం

సమాజంలో తండ్రిని బిడ్డలకు రక్షకుడిగా భావిస్తారు. కానీ కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా, బీరూర్ ప్రాంతంలో మానవత్వం సిగ్గుపడేలా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం డబ్బు ఆశతో ఒక తండ్రి తన మైనర్ కుమార్తెను వ్యభిచార కూపంలోకి నెట్టాడు.

ఈ దారుణమైన నేరంలో బాలిక సొంత అమ్మమ్మ కూడా పాలుపంచుకోవడం గమనార్హం. ఈ కేసులో పోలీసులు తండ్రి, అమ్మమ్మతో సహా ఇప్పటివరకు 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

ఏం జరిగింది?

బాధిత మైనర్ బాలిక తల్లి కొంతకాలం క్రితం మరణించింది. అప్పటి నుండి బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకున్న ఆ బాలిక, తన ఇంటర్మీడియట్ (PUC) పూర్తి కాగానే తండ్రి వద్దకు తిరిగి వచ్చింది. తండ్రి నీడలో రక్షణ దొరుకుతుందని ఆశించిన ఆ బిడ్డకు, తన తండ్రే తనను బలిపశువును చేస్తాడని ఊహించలేదు.

రూ. 5 వేల కోసం కుట్ర: డిసెంబర్ నెలలో తండ్రి తన కూతురిని తీసుకుని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ భరత్ శెట్టి అనే వ్యక్తితో కలిసి వీరు బాలికను అమ్మేయడానికి డీల్ కుదుర్చుకున్నారు. ఈ వృత్తిలోకి వస్తే రోజుకు 5 వేల రూపాయలు సంపాదించవచ్చని భరత్ శెట్టి ఆశ చూపగా, కన్నతండ్రి తన బిడ్డ గౌరవాన్ని తాకట్టు పెట్టాడు.

మంగళూరులో రెండు రోజుల నరకం:

నిందితుడైన తండ్రి తన కూతురిని తీసుకుని భరత్ శెట్టితో కలిసి మంగళూరు వెళ్లాడు. దారిలో ఆ బాలిక “నాన్న, నాకు నెలసరి (Periods) నడుస్తోంది, ఆరోగ్యం బాలేదు” అని ప్రాధేయపడినా, ఆ రాక్షస తండ్రి కనికరించలేదు. మరుసటి రోజు భరత్ శెట్టి ఆ బాలికను బెదిరించి, కొందరు వ్యక్తులతో గడపాలని ఒత్తిడి చేశాడు.

బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాలు:

  • 20 నుండి 45 ఏళ్ల వయస్సు గల నలుగురు వ్యక్తులు తనపై వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు.
  • తను మైనర్ అని, వదిలేయమని ఎంత బతిమలాడినా వారు వినలేదు.
  • భరత్ శెట్టికి డబ్బులు ఇచ్చి, రెండు రోజుల పాటు ఆమెను లైంగికంగా వేధించారు.
ముఠా గుట్టురట్టు:

బాలిక ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే స్పందించి తండ్రి, అమ్మమ్మ మరియు ప్రధాన నిందితుడు భరత్ శెట్టి సహా 12 మందిని అరెస్ట్ చేశారు. భరత్ శెట్టి దక్షిణ కన్నడ జిల్లాలో పెద్ద వ్యభిచార నెట్‌వర్క్ నడుపుతున్నాడని, అతనిపై ఇప్పటికే 8కి పైగా కేసులు ఉన్నాయని విచారణలో తెలిసింది.


Posted

in

by

Tags: