భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌లో 4వ స్థానంలో బరిలోకి దిగుతున్న శ్రేయస్ అయ్యర్ ప్రస్తుత బ్యాటింగ్ ఫామ్ తీవ్ర నిరాశ కలిగిస్తోందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శించారు.
తన కెరీర్లో ఆడిన మొత్తం మ్యాచ్‌లలో అయ్యర్ పెద్దగా పరుగులు సాధించలేదని, అంతర్జాతీయ స్థాయిలో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసే ఒక ఆటగాడు ఇలా వెనుకబడిపోవడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
అంతేకాకుండా, క్రీజులో ఉన్నప్పుడు అయ్యర్ తీవ్రంగా తడబడుతున్నాడని.. ఒక సెంచరీ మినహా మిగిలిన ఇన్నింగ్స్‌లలో అతని గణాంకాలు (స్టాట్స్) చాలా పేలవంగా ఉన్నాయని మంజ్రేకర్ ఎత్తి చూపారు.
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి ఇతర యువ ఆటగాళ్ల ప్రదర్శనలపైనే అందరి దృష్టీ ఉండటంతో, శ్రేయస్ అయ్యర్ మాత్రం ఎలాంటి పెద్ద విమర్శలు ఎదుర్కోకుండా సులభంగా తప్పించుకుంటున్నాడని ఆయన ఆరోపించారు.
జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ వంటి బలహీనమైన జట్లపై తేలికగా విజయాలు సాధించడాన్ని బట్టి కెప్టెన్సీ సామర్థ్యాన్ని లెక్కించలేమని.. ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుతో జరిగిన సిరీస్‌లో భారత జట్టు ఓటమి చవిచూడటాన్ని ఆయన ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Leave a Reply