“నా కూతురినే గుద్దాలని చూస్తున్నారా రా..?” కూతురి కోసం సింహంలా మారిన తండ్రి.. ప్రమాదం చేసి పారిపోవాలనుకున్న కార్ డ్రైవర్‌కు ఇచ్చిన షాక్.. నడిరోడ్డుపై జరిగిన దాడి వీడియో..!!

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని ఒక రద్దీగా ఉండే రోడ్డుపై, తండ్రి తన పాఠశాలకు వెళ్లే కూతురితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు.

ఆ సమయంలో ఊహించని విధంగా వచ్చిన ఒక కారు, వారు వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఆగ్రహానికి గురైన ఆ తండ్రి వెంటనే లేచి కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు వెళ్లాడు. అయితే కారు నడుపుతున్న వ్యక్తి కిటికీ అద్దాలు దించేందుకు గానీ, అతనితో మాట్లాడేందుకు గానీ నిరాకరించాడు. పైగా కారు తలుపులు కూడా లాక్ చేసి ఉండటంతో తండ్రి ఆ డ్రైవర్‌ను మాట్లాడించలేకపోయాడు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి, రోడ్డు పక్కన పడి ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని కారు ముందు అద్దంపై బలంగా కొట్టి పగలగొట్టాడు. పరిస్థితి చెయ్యి దాటిపోతోందని గ్రహించిన కారు డ్రైవర్, వెంటనే వాహనాన్ని అక్కడి నుంచి వేగంగా పోనిచ్చి పారిపోయేందుకు ప్రయత్నించాడు.

కారు పారిపోవడం చూసిన ఆ తండ్రి, వదలకుండా మరొక రాయిని చేతిలోకి తీసుకుని కారు వెంటే పరుగెత్తాడు. అనంతరం వెళ్తున్న కారు వెనుక అద్దంపై ఆ రాయిని విసిరేశాడు, దాంతో వెనుక అద్దం కూడా ముక్కలు ముక్కలైంది. అయినా సరే దాన్ని పట్టించుకోకుండా కారు డ్రైవర్ అక్కడ నుంచి పారిపోయాడు.

పట్టపగలు రద్దీగా ఉండే రోడ్డుపై జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డై నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *