“నా చావుకి వీళ్లే కారణం!” ఫేస్‌బుక్ లైవ్‌లో ఏడుస్తూ నదిలోకి దూకిన యువకుడు. కాపాడిన మత్స్యకారులు – థ్రిల్లింగ్ వైరల్ సంఘటన.!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశంబి జిల్లాలో భార్యతో గొడవపడి తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి, ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ గంగా నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

మధ్యాహ్నం వేళ నదిలోకి దూకిన అతడిని, అక్కడే ఉన్న మత్స్యకారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది.

పరవారి మునిసిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న 26 ఏళ్ల అంకిత్ కుమార్‌కు, అతని భార్యకు మధ్య సెల్‌ఫోన్ వాడకం విషయంలో గొడవ జరిగింది. దీంతో భార్య, బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో భార్య విడిపోవడం, అత్తగారింటి వారు తనను వేధించి దాడి చేశారంటూ చేతిలో లేఖ పట్టుకుని అంకిత్ ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడాడు. అనంతరం గంగా వంతెన పైనుంచి నదిలోకి దూకేశాడు.

ఆత్మహత్యకు యత్నించిన అతడిని నది నుంచి కాపాడిన మత్స్యకారులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *