“నా బిడ్డను నాకు ఇవ్వండి!” ఆసుపత్రి ఎదుట గుండెలవిసేలా రోదిస్తున్న తల్లుల ఆర్తనాదాలు.. ఇస్లామాబాద్ ఆసుపత్రిలో పెను విషాదం..!!

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ‘పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (PIMS) ప్రభుత్వ ఆసుపత్రిలోని 3వ అంతస్తులో ఉన్న ప్రసూతి మరియు శిశు సంరక్షణ విభాగంలో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ఈ అగ్నిప్రమాదంలో చిక్కుకుని ఊపిరాడక, తీవ్ర కాలిన గాయాలతో 14 మంది నవజాత శిశువులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఎయిర్ కండీషనర్ (AC)లో తలెత్తిన సాంకేతిక లోపం (షార్ట్ సర్క్యూట్) వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ప్రమాద విషయం తెలిసి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు.. “నా బిడ్డను నాకు అప్పగించండి” అంటూ కన్నీరుమున్నీరై వేడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విడుదలై అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. సహాయక చర్యలు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్లే ఇంతమంది పసికందులు ప్రాణాలు కోల్పోయారని బాధిత తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *