ప్రేమ, అనురాగం ఒకవైపు ఉన్నా.. తన భర్త రాత్రిపూట చేసే పనుల వల్ల తాను నరకం అనుభవిస్తున్నానంటూ ఒక మహిళ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది.
బ్రిటన్కు చెందిన ‘మమ్స్నెట్’ (Mumsnet) అనే వెబ్సైట్లో ఆ మహిళ తన బాధను ఇలా పంచుకుంది: “నా భర్త అంటే నాకు ప్రాణం. కానీ అతనితో కలిసి బెడ్ పంచుకోవడం ఇప్పుడు నాకు పెద్ద శిక్షగా మారింది. భుజం నొప్పి వల్ల అతను రాత్రంతా ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. దానికి తోడు విపరీతమైన గురక, నిద్రలో చేసే వింత శబ్దాలు, మాటిమాటికీ లైట్లు వేసి బాత్రూమ్కు వెళ్లడం వంటి పనులతో నా నిద్రను దూరం చేస్తున్నాడు.”
అంతేకాకుండా, తన భర్త తెల్లవారుజామున 5 గంటలకే అలారం పెట్టుకుంటాడని, అది మోగగానే ఆపకుండా పదేపదే ‘స్నూజ్’ (Snooze) నొక్కుతూ నిద్రపోతుంటాడని ఆమె పేర్కొంది. దీనివల్ల తన ఆరోగ్యం దెబ్బతింటోందని, పగటిపూట ఆఫీసు పనిపై దృష్టి పెట్టలేకపోతున్నానని ఆమె వాపోయింది.
“దంపతులు వేర్వేరు గదుల్లో పడుకుంటే అది విడాకులకు దారి తీస్తుందని ఎక్కడో చదివాను. కానీ నిద్ర లేకపోవడం వల్ల నా ఆరోగ్యం పాడవుతోంది. భర్త మనసు కష్టపెట్టకుండా ‘స్లీప్ డివోర్స్’ (Sleep Divorce) అంటే.. కేవలం నిద్ర కోసం వేర్వేరు గదులు ఎలా పంచుకోవాలి?” అని ఆమె నెటిజన్లను అడిగింది. దీనిపై స్పందించిన చాలామంది గృహిణులు.. “ఆరోగ్యమే ముఖ్యం, ప్రశాంతంగా నిద్రపోవడానికి వేరే గదిలోకి మారడంలో తప్పులేదు” అని ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.
