“నా భార్య తిరిగి వస్తే చాలు!”.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వ్యామోహం.. ఇద్దరు పిల్లలను నడిరోడ్డున పడేసి భార్య ఘాతుకం.. రూ. 100 బాండ్ పేపర్‌పై వింత ఒప్పందం!

ఛతర్‌పూర్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్‌పూర్ (Chhatarpur) జిల్లాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసే పిచ్చి కారణంగా ఒక అందమైన కుటుంబం రోడ్డున పడింది. చూసేవారి కళ్లు చెమ్మగిల్లేలా చేసిన ఈ సోగకరమైన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఛతర్‌పూర్ జిల్లాలోని ఛాపర్ గ్రామానికి చెందిన ముకుంది అహిర్వార్ అనే రోజువారీ కూలీ, ఇటీవల తన భార్య పింకి అహిర్వార్‌కు ఒక స్మార్ట్‌ఫోన్ కొనిచ్చాడు. ఫోన్ చేతికి వచ్చినప్పటి నుండి పింకి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ మరియు వీడియోలు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా ఆమెకు.. తనకంటే 5 ఏళ్లు చిన్నవాడైన సత్యదేవ్ శర్మకార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా కాలక్రమేణా అక్రమ సంబంధంగా మారింది.

పిల్లలను వదిలేసి ప్రియుడితో జంప్ – రూ. 100 బాండ్ పేపర్ అగ్రిమెంట్:
ఈ నేపథ్యంలో, భార్య పింకి తన భర్తను, 9 ఏళ్ల కుమార్తెను మరియు 4 ఏళ్ల కుమారుడిని గాలికొదిలేసి.. ఆ ప్రియుడితో కలిసి ఇల్లు వదిలి పారిపోయింది. అంతేకాకుండా, భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు.. వీరిద్దరూ కలిసి రూ. 100 స్టాంప్ పేపర్‌పై ఒక వింతైన ‘లివ్-ఇన్ రిలేషన్‌షిప్’ ఒప్పందాన్ని (Agreement) కూడా రాసుకున్నారు.

తాము ఇద్దరం పూర్తి ఇష్టపూర్వకంగా కలిసి జీవిస్తున్నామని, భవిష్యత్తులో ఒకరిపై ఒకరు ఎలాంటి వివాహ హక్కులను డిమాండ్ చేయకూడదని ఆ అగ్రిమెంట్‌లో షాకింగ్ నిబంధనలను పొందుపరిచారు.

ఎస్పీ ఆఫీసులో భర్త కన్నీటి ఆవేదన:
భార్య చేసిన పనికి నివ్వెరపోయిన భర్త ముకుంది.. తన ఇద్దరు చిన్న పిల్లలను చేతులతో పట్టుకుని ఛతర్‌పూర్ ఎస్పీ (SP) కార్యాలయానికి చేరుకున్నాడు. “నా భార్య చేసిన తప్పులన్నింటినీ నేను క్షమించి, ఆమెను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా పిల్లల భవిష్యత్తు కోసం దయచేసి ఆమెను వెతికి పట్టుకోండి” అని కన్నీరుమున్నీరవుతూ ఫిర్యాదు చేశాడు.

ఈ వింతైన లివ్-ఇన్ అగ్రిమెంట్ మరియు ఒక కుటుంబం రోడ్డున పడిన వ్యవహారంపై పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.


Posted

in

by

Tags: