బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాకకు కొన్ని గంటల ముందు బెగుసరాయ్‌లోని హెలిప్యాడ్ వద్ద ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ‘సమృద్ధి యాత్ర’లో భాగంగా ఏర్పాటు చేసిన భద్రతా వలయంలోకి ఒక వీధి ఎద్దు దూసుకురావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం సిద్ధం చేసిన ప్రదేశంలోకి ఆ ఎద్దు అకస్మాత్తుగా ప్రవేశించింది. అక్కడ ఉన్న పోలీసులు దానిని తోలివేసేందుకు ప్రయత్నించగా, అది రివర్స్ అయ్యి ఒక పోలీసు అధికారిని వెంటాడింది. ప్రాణభయంతో ఆ అధికారి పరుగులు తీయగా, మిగిలిన సిబ్బంది కూడా అటు ఇటు చెల్లాచెదురయ్యారు. కొద్దిసేపు ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది.
