కర్ణాటక: కర్ణాటక రాష్ట్రంలోని కార్వార్ నుండి అంకోలా వైపు ఒక ప్రభుత్వ బస్సు వెళ్తోంది. ఆ బస్సులో తన సోదరుడితో కలిసి ప్రయాణిస్తున్న ఒక యువతి, ప్రయాణ అలసట వల్ల తన సీటులో కూర్చునే కనుకు తీసింది.
దీనిని అదునుగా భావించిన పక్క సీటులో కూర్చున్న ఒక వ్యక్తి, ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన ఆ యువతి, జరిగిన విషయాన్ని గ్రహించి మొదట దిగ్భ్రాంతికి గురైంది.
యువతి సాహసం
అయితే, ఆ భయం నుండి వెంటనే కోలుకున్న ఆ యువతి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సెల్‌ఫోన్ తీసి ఆ వ్యక్తి ముఖాన్ని వీడియో తీసింది. అంతేకాకుండా, బస్సులోనే అందరి ముందూ ఆ వ్యక్తిని నిలదీస్తూ చుక్కలు చూపించింది.
అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా, ఉన్నత పోలీసు అధికారులకు ట్యాగ్ (Tag) చేసింది. ఈ వీడియో కాస్తా దావానంలా వైరల్ కావడంతో, ఉత్తర కన్నడ ఎస్పీ దీపన్ ఎం.ఎన్ స్పందించి ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
