“నీ భర్త ఊరిలో లేడా.. నేను వస్తా”: మహిళా ఉద్యోగి చీర లాగిన టీమ్ లీడర్; TCSలో వెలుగుచూసిన దారుణ ఘటన!

భారతదేశపు అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టీసీఎస్ (TCS) నాసిక్ శాఖ ఇప్పుడు ఒక భయంకరమైన ఆరోపణతో ఉలిక్కిపడింది. అక్కడ పనిచేస్తున్న సుమారు 6 కంటే ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు, తమకు జరిగిన లైంగిక వేధింపులు మరియు బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితురాలైన ఒక మహిళ తన వాంగ్మూలంలో.. వివాహిత అయిన తనను తోటి పురుష ఉద్యోగులు “ప్లేయర్” మరియు “జీరో ఫిగర్” అంటూ ఎగతాళి చేసేవారని, తన భర్త ఊరిలో లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని లైంగికంగా వేధించేవారని పేర్కొంది.

రజా మీనన్ అనే టీమ్ లీడర్ ఆ మహిళ చీర పట్టుకుని లాగాడని, ఆసిఫ్ అన్సారీ అనే వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. “ఇది కార్పొరేట్ జిహాద్‌లా కనిపిస్తోంది, ఇది చాలా తీవ్రమైన విషయం” అని వ్యాఖ్యానించారు.

నాసిక్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి, ఈ ఘటనతో సంబంధం ఉన్న ఒక మహిళా మేనేజర్ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు, టీసీఎస్ సంస్థ సంబంధిత ఉద్యోగులను సస్పెండ్ చేసింది. అయితే, “మా ఫిర్యాదుల పెట్టెలో ఇలాంటి ఫిర్యాదులేవీ రాలేదు” అని సంస్థ నీళ్లు నమలడం గమనార్హం.

మరోవైపు, అరెస్టయిన వారి కుటుంబ సభ్యులు ఇది ఒక పక్కా ప్రణాళికతో చేసిన కుట్ర అని వాదిస్తున్నారు. ఐటీ రంగంలో పనిచేసే మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags: