“నీ యూనిఫాం ఊడదీయిస్తా!” కారు ఆపినందుకు డీఎస్పీపై రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే… నడిరోడ్డుపై బహిరంగ బెదిరింపులు! నెట్టింట వైరల్ వీడియో!

ఉత్తరప్రదేశ్‌లోని మధుర పరిధిలో గల బృందావనంలో ఘనంగా జరిగిన ప్రసిద్ధ ‘హరియాలీ తీజ్’ పండుగ వేళ తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది.

ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో.. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ఈ క్రమంలో బందోబస్తు విధుల్లో ఉన్న డీఎస్పీ అమిత్ పాఠక్, ఆ మార్గంలో వస్తున్న అలీగఢ్ కోల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అనిల్ పరాశర్ కారును ఆపి పాసులు, అనుమతి పత్రాల వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

పోలీసులు తన కారునే ఆపి ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోయిన ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కారు దిగి విధుల్లో ఉన్న డీఎస్పీతో నడిరోడ్డుపై తీవ్ర వాగ్వాదానికి దిగారు. తన అధికార దర్పంతో డీఎస్పీపై విరుచుకుపడుతూ.. “క్షణాల్లో నీ యూనిఫాం ఊడదీయిస్తా” అంటూ ఏకవచనంతో బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడే ఉన్న మరో పోలీస్ అధికారి వచ్చి ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపించివేశారు. నలుగురిలో ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిని ఎమ్మెల్యే బెదిరించిన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ తీవ్ర దుమారానికి దారితీశాయి.


Posted

in

by

Tags: