“నువ్వు మా నాన్నలాంటి వాడివి”.. 13 ఏళ్ల బాలికపై తల్లి ప్రియుడి దారుణం.. గర్భవతి అయిన బాలిక!

తమిళనాడు: తల్లి ప్రియుడి కామవాంఛకు 13 ఏళ్ల బాలిక బలైపోయిన ఘటన తూత్తుక్కుడి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నారు.

అసలేం జరిగింది? తూత్తుక్కుడి జిల్లాకు చెందిన తంగకుమార్, ముత్తుసెల్వి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆరేళ్ల క్రితం గొడవల వల్ల విడిపోయిన ముత్తుసెల్వి, తన పిల్లలతో కలిసి మామునియపురంలో నివాసముంటోంది. అక్కడ ముత్తుమురుగన్ అనే వ్యక్తితో ముత్తుసెల్వికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ గత ఐదేళ్లుగా కలిసి ఉంటున్నారు.

స్కూల్లో బయటపడ్డ నిజాం: ముత్తుసెల్వి 13 ఏళ్ల కుమార్తె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం తరగతి గదిలో ఉండగా ఆ బాలిక అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయింది. ఉపాధ్యాయులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్య పరీక్షల్లో ఆమె గర్భవతి అని, గర్భస్రావం కోసం మందులు వాడిందని తేలింది. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు.

తండ్రికి తెలిసిన చేదు నిజం: ఆసుపత్రి నుండి సమాచారం అందుకున్న బాలిక తండ్రి తంగకుమార్, తన కుమార్తెను అడగగా.. తన తల్లి లేని సమయంలో ముత్తుమురుగన్ తనపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పి కన్నీరుమున్నీరైంది. తనను నాన్నలా చూసుకోవాల్సిన వ్యక్తి ఇలా చేశాడని చెప్పి ఆమె భోరున విలపించింది.

పోలీసుల స్పందన: ఈ ఘటనపై తంగకుమార్ విలాత్తికుళం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, నిందితుడు ముత్తుమురుగన్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడని, అతడిని వెంటనే అరెస్టు చేయాలని తండ్రి తంగకుమార్ జిల్లా ఎస్పీకి వేడుకున్నారు. తల్లి ప్రియుడి అరాచకానికి 13 ఏళ్ల బాలిక బలైపోవడం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.


Posted

in

by

Tags: