“నువ్వు లేకపోతే చచ్చిపోతాను” అని బెదిరించి ప్రియురాలిని పిలిపించి హత్య.. శవంతో లైంగిక దాడి చేసిన దారుణం..!!

కోజికోడ్: కేరళలోని కోజికోడ్ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల వైశాఖన్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను తన పెళ్లి విషయాన్ని దాచిపెట్టి ఒక 26 ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఒకానొక సమయంలో వైశాఖన్‌కు పెళ్లయిన విషయం తెలియడంతో, ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని అతడిని ఒత్తిడి చేయడం ప్రారంభించింది.

దీనితో ఆగ్రహానికి గురైన వైశాఖన్, ఆ యువతిని తన ఇనుప వర్క్‌షాప్‌కు రప్పించాడు. అక్కడ తాను ఆత్మహత్య చేసుకుంటానని నాటకమాడాడు. అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆ యువతిని గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు.

ఆమె మరణించినట్లు నిర్ధారించుకున్న తర్వాత, ఆ మృతదేహంతో లైంగిక దాడికి పాల్పడి తన వికృత వాంఛను తీర్చుకున్నాడు. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. తన భార్యకే ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వమని చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, వైశాఖన్ పొంతన లేని సమాధానాలు చెప్పాడు. పోలీసుల తీవ్ర విచారణలో, తాను ఆమెను చంపి, మృతదేహంతో లైంగిక దాడికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.


Posted

in

by

Tags: