ఒక సాధారణ డ్రై క్లీనింగ్ షాపు నడిపే దంపతులు నెలకు ₹2 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నళిని ఉనాగర్ అనే కంటెంట్ క్రియేటర్ తన ఇంటి దగ్గర ఉన్న షాపు యజమానితో మాట్లాడిన వివరాలను ‘X’ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.
ఆదాయం లెక్కలు ఇవే: నళిని పంచుకున్న వివరాల ప్రకారం ఆ షాపులో దంపతులతో పాటు ఇద్దరు సహాయకులు పని చేస్తున్నారు.
- రోజువారీ ఇస్త్రీ (Ironing): రోజుకు సుమారు 350 బట్టలు (ఒక్కోదానికి ₹10 చొప్పున) = ₹3,500.
- డ్రై క్లీనింగ్: సూట్లు, శారీలు వంటి ప్రీమియం బట్టలు రోజుకు 20 (ఒక్కోదానికి ₹350 చొప్పున) = ₹7,000.
- మొత్తం రోజువారీ సంపాదన: ₹10,500.
- నెలవారీ ఆదాయం: నెలలో కేవలం 3 రోజులు సెలవు తీసుకోగా, మొత్తం ఆదాయం సుమారు ₹2,83,500.
నికర లాభం: సొంత షాపు కావడం వల్ల అద్దె లేదు. కరెంటు బిల్లు ₹6,000, ఇద్దరు సహాయకుల జీతాలు ₹40,000 తీసేయగా, ఆ దంపతులకు నెలకు సుమారు ₹2,37,500 నికర లాభం మిగులుతోంది.
నెటిజన్ల స్పందన: ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తెల్లవార్లూ కోడింగ్‌తో కుస్తీ పడుతుంటే, ఇక్కడ భయ్యా 2 నిమిషాల్లో ముడతలు పోగొట్టి అంతే సంపాదిస్తున్నారు” అని ఒకరు జోక్ చేయగా, “పాపం, ఇప్పుడు వీరి ఆదాయం బయటపెట్టారు కాబట్టి ఆదాయపు పన్ను శాఖ వారు వారిపై దాడులు చేస్తారు” అని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
