ఉత్తరాఖండ్‌లోని కోద్వార్కు చెందిన దీపక్ కుమార్, ఇప్పుడు ‘మొహమ్మద్ దీపక్’ అనే పేరుతో సోషల్ మీడియాలో నిలిచారు. ఒక ముస్లిం వ్యాపారికి మద్దతు పలకడం వల్ల వచ్చిన వివాదంతో, ఆయన వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. తన జీవనాధారమైన ‘హల్క్’ (Hulk) జిమ్‌ను నడపలేక, అద్దె చెల్లించలేక ఆయన దానిని అమ్మకానికి పెట్టే దుస్థితికి చేరుకున్నారు.
జిమ్ నడపడం కష్టంగా మారింది: దీపక్ కుమార్ మాట్లాడుతూ, గత నాలుగు నెలలుగా తాను జిమ్ అద్దెను చెల్లించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి యజమాని కూడా తనకు చివరి హెచ్చరిక (Warning) జారీ చేశారని ఆయన తెలిపారు. జిమ్ అద్దె నెలకు రూ. 40,000 ఉండగా, ప్రస్తుత పరిస్థితుల వల్ల జిమ్‌కు వచ్చే క్లయింట్ల సంఖ్య 60-65కి పడిపోయింది. ఈ సంపాదనతో జిమ్ నిర్వహణ ఖర్చులు, అద్దె చెల్లించడం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు.
అసలు వివాదం ఏమిటి? ఈ ఏడాది జనవరి 26న పటేల్ మార్గ్‌లో వకీల్ అహ్మద్ అనే ముస్లిం వ్యాపారికి మద్దతుగా దీపక్ కుమార్ నిలిచారు. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఒక ముస్లిం వ్యక్తి దుకాణం పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్న సమయంలో, దీపక్ కుమార్ ముస్లిం వ్యాపారికి మద్దతు తెలుపుతూ తనను తాను ‘మొహమ్మద్ దీపక్’ అని పిలుచుకున్నారు. అప్పటి నుండి ఈ వివాదం కొనసాగుతుండటంతో, దీపక్ కుమార్ అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఆర్థిక సంక్షోభం: దీపక్ కుమార్ నిర్వహించే ‘హల్క్’ జిమ్‌కు కొత్తగా ఎవరూ చేరడం లేదు, పాత క్లయింట్లు కూడా తగ్గిపోయారు. బయటి ఒత్తిళ్లు మరియు వరుస వివాదాల వల్ల వ్యాపారం నడపడం కష్టంగా మారిందని, అందుకే తన జిమ్‌ను అమ్మకానికి పెట్టడం తప్ప తనకు వేరే మార్గం లేదని ఆయన వాపోయారు.
