“నెల రెంట్ మాత్రమే రూ. 60,000 ఆ?.. ఇది ఇండియానా లేక స్విట్జర్లాందా? నోరెళ్లబెడుతున్న నెటిజన్లు! అంతలా ఏముంది అక్కడ?”

బెంగళూరులోని ఒక భారీ లగ్జరీ రెసిడెన్షియల్ సొసైటీలో నివసిస్తున్న రాధిక, ఏకాన్ష్ అనే యువ దంపతులు.. అక్కడ ఉన్న ప్రపంచ స్థాయి వసతులకు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపారు.

23 టవర్లు.. రూ. 60,000 అద్దె
మొత్తం 23 టవర్లు కలిగిన ఈ అత్యాధునిక సొసైటీలో ఒక 2BHK ఫ్లాట్ కోసం వీరు నెలకు రూ. 60,000 అద్దె చెల్లిస్తున్నారు. అయితే, వీరు చెల్లించే అద్దెకు ఈడుగా అక్కడ లభించే విలాసవంతమైన వసతులు చూసేవారికి కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి.

స్విట్జర్లాండ్‌ను తలపించే మినీ నగరం!
స్విట్జర్లాండ్ దేశపు ప్రకృతి సౌందర్యాన్ని తలపించేలా కంటికి ఇంపుగా ఉండే పచ్చని తోటలు, విశాలమైన లాన్లు, పెంపుడు జంతువుల (పెట్స్) కోసం ప్రత్యేక పార్కులు, మూడు స్విమ్మింగ్ పూల్స్, అత్యాధునిక జిమ్‌లు, బ్యూటీ సెలూన్లు.. ఇలా ఈ గేటెడ్ కమ్యూనిటీ కాంప్లెక్స్ లోపల ఒక మినీ నగరమే నడుస్తోంది.

సొసైటీ లోపలే ‘లగ్జరీ హోటల్’ వసతి
అంతటితో ఆగకుండా, ఈ సొసైటీ లోపలే రెస్టారెంట్ మరియు బార్‌తో కూడిన భారీ క్లబ్ హౌస్ వసతి ఉంది. అంతేకాదు, వెలుపలి ఊర్ల నుండి వచ్చే అతిథులు (గెస్ట్స్) స్టే చేయడానికి ఒక మినీ ‘గెస్ట్ హోటల్’ సౌకర్యం కూడా ఇక్కడ కల్పించారు.

ఈ విలాసవంతమైన లైఫ్‌స్టైల్ కోసం తమకు ఏడాదికి అదనంగా రూ. 2.5 లక్షల వరకు మెయింటెనెన్స్ ఖర్చవుతున్నప్పటికీ, తాము ఎంతో సంతోషంగా ఉన్నామని ఆ దంపతులు వీడియోలో పంచుకున్నారు.

“ఈ అదనపు ఖర్చును మేము వృధాగా భావించడం లేదు. మా మనశ్శాంతి కోసం, ప్రశాంతమైన జీవనశైలి కోసం చేసుకున్న ఒక మంచి పెట్టుబడిగా (ఇన్వెస్ట్‌మెంట్) భావిస్తున్నాం” అని వారు పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో దావానంలా వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags: