గత కొన్ని రోజులుగా భారీ హెచ్చుతగ్గులకు లోనైన బంగారం ధరలు, ఏప్రిల్ మొదటి వారం చివరి నాటికి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత రెండున్నర నెలలుగా కొనసాగుతున్న ఈ అనిశ్చితికి తాత్కాలికంగా బ్రేక్ పడుతూ, వారాంతంలో ధరలు స్థిరంగా ఉండటం పసిడి ప్రేమికులకు కాస్త ఉపశమనాన్ని కలిగించింది.
అయితే, రేపటి నుండి బంగారం ధరల్లో మళ్లీ భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీన బంగారం మరియు వెండి ధరల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి:
అంతర్జాతీయ ప్రభావం:
ప్రస్తుతం బంగారం ధరలు తగ్గినా, మున్ముందు ఇవి భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ vs అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, డాలర్ విలువ బలపడటం మరియు అమెరికా ఆర్థిక విధానాలు వంటి అంశాలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
నేటి బంగారం ధరల వివరాలు (ఏప్రిల్ 5, ఆదివారం):
భారత్లో బంగారం ధరలు గరిష్ట స్థాయిల నుండి 17% మేర తగ్గినప్పటికీ, వారాంతంలో ధరలు యథాతథంగా ఉన్నాయి.
- 18 క్యారెట్ల బంగారం: ఆదివారం 18 క్యారెట్ల ధర భారీగా తగ్గింది. 1 గ్రాము ధర ₹11,320 కాగా, 10 గ్రాముల ధర ₹1,13,200 గా ఉంది.
- 22 క్యారెట్ల బంగారం: 1 గ్రాము ధర ₹13,835. ఇక 10 గ్రాముల బంగారం ధర ₹1,38,350 వద్ద కొనసాగుతోంది. శనివారంతో పోలిస్తే ధరలో ఎలాంటి మార్పు లేదు.
- 24 క్యారెట్ల బంగారం: 1 గ్రాము ధర ₹15,093. అలాగే 10 గ్రాముల ధర ₹1,50,930 గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే ధర స్థిరంగా ఉంది.
గమనిక: 1905 నుండి 2026 వరకు 120 ఏళ్ల కాలంలో బంగారం ధరల ప్రస్థానాన్ని పరిశీలిస్తే, బంగారం ఎప్పుడూ తన విలువను కోల్పోలేదని అర్థమవుతుంది.
వెండి ధర ఎంత?
వెండి ధరలు కూడా నేడు స్థిరంగా ఉన్నాయి.
- 1 గ్రాము వెండి: ₹250
- 1 కిలో వెండి: ₹2.50 లక్షలు
