“నేను చాలా బిజీ..!” ఉదయాన్నే వంట చేయాలి, గిన్నెలు తోమాలి.. ఆ తర్వాత దేశాన్ని పాలించాలి..! ఉద్యోగం చేసే మహిళల అసలు జీవితాన్ని కళ్లకు కట్టిన మహిళా ప్రధాని వైరల్ ప్రసంగం.. !!

ఉదయాన్నే లేచి వంట చేయడం, గిన్నెలు కడగడం వంటి ఇంటి పనులన్నింటినీ చక్కబెట్టుకుంటూనే, మరోవైపు దేశంలోనే అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నానని జపాన్ ప్రధాని సనా తకైచి బహిరంగంగా వెల్లడించారు.

దేశ ప్రధానిగా కొనసాగుతున్న ఒక మహిళ.. కీలక ప్రభుత్వ నిర్ణయాలు, ఉన్నత స్థాయి సమావేశాల నడుమ, పురుష ప్రధానులతో పోలిస్తే రోజువారీ ఇంటి పనుల కోసమే అదనంగా మూడు నుండి నాలుగు గంటల సమయాన్ని కేటాయించాల్సి వస్తోందని ఆమె కాస్త ఆవేదనతో పేర్కొన్నారు.

ఉదయం వంట చేయడం, అంట్లు తోమడం, విధులకు సిద్ధమవ్వడం లాంటి బాధ్యతలతోనే తన రోజు మొదలవుతుందని ఆమె వివరించిన ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.

కేవలం ఒక రాజకీయ నాయకురాలిగానే కాకుండా.. ఉద్యోగాలు చేసే కోట్లాది మంది సామాన్య మహిళల తరహాలోనే అటు కుటుంబ బాధ్యతలను, ఇటు ఆఫీస్ పనులను సమన్వయం చేసుకుంటూ నిత్యం శ్రమించే మహిళల కష్టాలను ఆమె మాటలు స్పష్టంగా కళ్లకు కట్టాయి.

మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం అంటే కేవలం వారిని బయటకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోనివ్వడమే కాదని.. ఇంటి నాలుగు గోడల మధ్య వారు పడే శ్రమకు, వెచ్చించే సమయానికి తగిన గుర్తింపునిచ్చి బాధ్యతలను పంచుకోవాలనే గొప్ప నిజాన్ని ఈ సంఘటన గుర్తుచేస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *