“నేను 140 కిలోల బరువు.. ఆయన్ని బలంగా తన్నాను; ఇకపై ఇలాంటి ఫైట్స్ చేయను” – విజయకాంత్ గురించి పొన్నంబలం

తమిళ సినిమాల్లో విలన్‌గా గుర్తింపు పొందిన పొన్నంబలం.. విజయకాంత్‌తో కలిసి ‘ఆనెస్ట్ రాజ్’ సినిమాలో నటించినప్పటి ఒక ప్రమాదకరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ ఫైట్ సీన్ తర్వాత విజయకాంత్ ఇకపై ఇలాంటి రిస్కీ ఫైట్లు చేయకూడదని నిర్ణయించుకున్నారట.

ఆ ఘటన ఏంటంటే: ‘ఆనెస్ట్ రాజ్’ షూటింగ్ సమయంలో ఒక ఫైట్ సీన్‌లో పొన్నంబలం విజయకాంత్‌ను ఛాతీపై కాలితో తన్నాల్సి ఉంది. అప్పుడు పొన్నంబలం బరువు 140 కిలోలు. విజయకాంత్ స్వయంగా వచ్చి “నువ్వు నిజంగానే నన్ను తన్నాలి, అప్పుడే ఆ సీన్ పండుతుంది” అని చెప్పారు. పొన్నంబలం భయపడుతూనే గట్టిగా తన్నడంతో విజయకాంత్ కిందపడిపోయారు. ఆ దెబ్బకు ఆయన పక్కటెముకలకు గాయమై (Fracture), ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. విజయకాంత్ కోలుకున్నాక ఆ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

విజయకాంత్ గొప్ప మనసు: పొన్నంబలం తన పెళ్లి రోజు జరిగిన ఒక సంఘటనను కూడా పంచుకున్నారు. ‘భరణి’ సినిమా షూటింగ్ రాత్రి 3 గంటల వరకు జరిగింది. మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకే పొన్నంబలం పెళ్లి. షూటింగ్ ముగించుకుని ఆయన మండపానికి వెళ్లేసరికి, విజయకాంత్ అప్పటికే అక్కడ ఉండి ఇంటి పెద్దలా పనులన్నీ చూసుకుంటున్నారు. అంతేకాకుండా, ఆ సమయంలో పొన్నంబలంకు ఆర్థికంగా సహాయం చేస్తూ ₹2.5 లక్షలు అందించారు.


Posted

in

by

Tags: