డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో, కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic). కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషీ, రుక్మిణీ వసంత్ వంటి స్టార్ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హీరో యశ్.. హీరోయిన్లతో బోల్డ్, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడంపై తన భార్య రాధికా పండిట్ స్పందన గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
“తెరపై తమ భాగస్వామి ఇతరులతో రొమాంటిక్ సీన్లలో నటించడాన్ని చూసినప్పుడు ఏ భార్యకైనా లేదా భర్తకైనా కాస్త అసౌకర్యంగా, ఇబ్బందిగా అనిపించడం సహజం. ఇందులో దాచడానికేమీ లేదు. నిజానికి నాకూ ఆ సీన్లలో నటించడం చాలా కష్టంగానే అనిపించింది. స్క్రీన్‌పై అది చూసి రాధిక కచ్చితంగా సంతోషపడి ఉండదు. అయితే నాపై ఆమెకు ఎలాంటి కోపం లేదు; తను కూడా ఒక నటి కావడంతో సినిమా డిమాండ్‌ను, నటనను చక్కగా అర్థం చేసుకోగలదు. మా ఇద్దరి మధ్య బలమైన నమ్మకం ఉంది” అని యశ్ వివరించారు.
ఇదే సమయంలో లిప్‌లాక్ సన్నివేశాలపై వస్తున్న రూమర్లను ఖండిస్తూ.. “సినిమాలో నేను ఎవరికీ ముద్దు పెట్టలేదు. అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయనడంలో ఎలాంటి నిజం లేదు” అని యశ్ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో నయనతార.. యశ్‌కు సోదరి పాత్రలో కనిపిస్తుండటం విశేషం.
