“నైట్ డ్యూటీకి వెళ్లిన భర్త… ప్రియుడితో కలిసి అర్ధరాత్రి చెక్కర్లు కొట్టిన భార్య!” ఒకే మోమోస్ బండి వద్ద ప్రత్యక్షం… నడిరోడ్డుపై చితక్కొట్టిన భర్త! వైరల్ వీడియో!

సోషల్ మీడియాలో భార్యాభర్తలు మరియు ‘మూడో వ్యక్తి’కి సంబంధించిన వివాదాలు ఎప్పుడూ దావానలంలా వైరల్ అవుతుంటాయి.

ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నైట్ డ్యూటీకి వెళ్లిన భర్త, తన భార్యను మరో యువకుడితో కలిసి మోమోస్ సెంటర్ వద్ద రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

భోపాల్ నగరంలోని ఒక వీధిలో ఉన్న మోమోస్ బండి వద్ద ఈ హైడ్రామా చోటుచేసుకుంది. రోజూలాగే నైట్ డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి భర్త ఇంట్లోంచి బయలుదేరాడు. అయితే అదే సమయంలో ఆయన భార్య తన ప్రియుడితో కలిసి బైక్‌పై అదే ప్రాంతంలోని మోమోస్ సెంటర్‌కు వచ్చింది. విధి ఆడిన విచిత్ర నాటకమో ఏమో కానీ.. సరిగ్గా అదే సమయానికి ఆ భర్త కూడా తన స్నేహితుడితో కలిసి తినుబండారాల కోసం అదే మోమోస్ బండి వద్దకు వచ్చాడు.

తన భార్య వేరొక యువకుడితో సన్నిహితంగా ఉండటం చూసిన భర్తకు ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరుక్షణమే ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. మొదట మాటామాటాతో మొదలైన రచ్చ, కొద్దిసేపట్లోనే నడిరోడ్డుపై పరస్పర దాడులు, పిడిగుద్దుల వరకు వెళ్లింది.

నడిరోడ్డుపై భర్త, భార్య మరియు ఆమెతో వచ్చిన యువకుడు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ నానా హంగామా సృష్టించడంతో స్థానికులు షాక్ అయ్యారు. అక్కడున్న కొందరు వారిని విడదీసేందుకు ప్రయత్నించగా, మరికొందరు ఈ తతంగాన్నంతా తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

ఈ ఘటనపై అడిషనల్ డీసీపీ అనిల్ శర్మ మాట్లాడుతూ.. “ఈ గొడవకు సంబంధించిన వీడియో పోలీసుల దృష్టికి వచ్చింది. దీనిపై ప్రాథమిక విచారణ జరిపాము. ఇది పూర్తిగా వారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత గొడవ. అయితే ఇప్పటివరకు భార్యాభర్తలు కానీ, లేదా అవతలి వ్యక్తి కానీ పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి అధికారిక ఫిర్యాదు చేయలేదు” అని స్పష్టం చేశారు.


Posted

in

by

Tags: