పదో తరగతి పరీక్ష రాస్తూ విద్యార్థిని ప్రసవం: వెలుగులోకి మరిన్ని షాకింగ్ విషయాలు; నిశ్చితార్థం జరిగిన అమ్మాయి వేరొకరి వల్ల గర్భవతి!

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో గణితం పరీక్ష రాస్తూ టాయిలెట్‌కు వెళ్లిన పదో తరగతి విద్యార్థిని మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటనలో మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి.

పరీక్షా కేంద్రంగా ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాల టాయిలెట్‌లో ఆ మైనర్ బాలిక ప్రసవించింది. పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత ఆ విద్యార్థినికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆమె టాయిలెట్‌కు వెళ్ళింది. కొద్ది నిమిషాల తర్వాత శిశువు ఏడుపు విన్న ఉపాధ్యాయులు అక్కడికి వెళ్లగా ప్రసవం జరిగిన విషయం తెలిసింది. వెంటనే స్కూల్ యాజమాన్యం అంబులెన్స్‌ను పిలిపించి తల్లిని, బిడ్డను సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరీక్షలో ఆ బాలిక 8 నెలల 2 వారాల గర్భవతి అని తేలినట్లు ధార్ జిల్లా వైద్యాధికారి (CMHO) డాక్టర్ అనితా సింగర్ తెలిపారు.

కుటుంబ సభ్యుల వివరణ: అమ్మాయి గర్భవతి అన్న విషయం తమకు తెలియదని కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇచ్చారు. ఆమె వదులుగా ఉండే బట్టలు ధరించడం వల్ల ఆ విషయం గమనించలేదని తల్లిదండ్రులు వివరించారు. ఆ బాలికకు ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని, 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేయాలని నిర్ణయించుకున్నట్లు కుటుంబం తెలిపింది.

అసలు నిజం చెప్పిన బాలిక: అయితే, సమీప పట్టణానికి చెందిన ఒక యువకుడు బిడ్డకు తండ్రి అని, అతను బెదిరించడం వల్లే ఈ విషయం బయటకు చెప్పలేకపోయానని బాలిక పోలీసులకు తెలిపింది. 2024 గర్బా వేడుకల సమయంలో ఆ యువకుడితో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత పెళ్లి ప్రపోజల్‌ను నిరాకరించడంతో అతను తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మొగ్గు చూపింది. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించడంతోనే గర్భం దాల్చిన విషయాన్ని దాచిపెట్టినట్లు వివరించింది.

ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, శిశువు బరువు 2 కిలోలు ఉన్నందున ధార్ జిల్లా ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉంచామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: