“పరిహారం పేరుతో ఇంతటి దారుణమా?” — తల్లిదండ్రులు చేసిన తప్పుతో నాశనమైన బాలిక జీవితం.. నకిలీ బాబా అరెస్ట్!

మహారాష్ట్రలో జాతక దోష పరిహారం చేస్తానని నమ్మించి 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

లాతూర్ ప్రాంతానికి చెందిన నకిలీ బాబా రామ్‌దాసి మహారాజ్ వద్దకు, తమ కుమార్తె జాతక దోషాన్ని తొలగించేందుకు తల్లిదండ్రులు ఆ బాలికను తీసుకెళ్లారు. తల్లిదండ్రులు ఉంచిన నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న ఆ కీచక బాబా, బాలికపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

బాధిత బాలికపై లైంగిక దాడి చేయడమే కాకుండా, ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీశాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే ఆ వీడియోను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ బాలిక, తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేక కొన్ని నెలల పాటు మానసిక వేదన అనుభవించింది.

తాజాగా బాధిత బాలిక గర్భం దాల్చడంతో, కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆరా తీయగా నకిలీ బాబా అసలు స్వరూపం బయటపడింది. ఈ విషయం తెలిసి షాక్‌కు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ నకిలీ బాబాను అరెస్టు చేసి జైలుకు తరలించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *