పల్లెటూరి సియా.. ఒకరితో మనసు నిండలేదు, ఆపై రెండో భర్త, ఆ తర్వాత మూడో వాడు.. ఇప్పుడు నాలుగో వాడి కోసం ఆమె ఏం చేసిందంటే!

జీవితంలో సుఖంగా, సంతోషంగా ఉండాలంటే మనిషికి సంతృప్తి ఉండటం చాలా ముఖ్యం. కొంతమందికి అన్నీ ఉన్నా సంతృప్తి ఉండదు. వారి మనసులో ఎప్పుడూ ఏదో ఒక వెలితి వెన్నాడుతూనే ఉంటుంది. ఎప్పుడూ కొత్తదాని కోసం పరుగెడుతుంటారు. దీనివల్ల దుఃఖం, నిరాశ, చిరాకు ఎదురవుతాయి. ఈ అసంతృప్తి వారి ప్రవర్తనలోనూ కనిపిస్తుంది. పవిత్రమైన వివాహ బంధాన్ని అపవిత్రం చేసే ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. ఒక మహిళ తన ప్రియుడి సహాయంతో కట్టుకున్న భర్తను హతమార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ మహిళకు అప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. నాలుగో పెళ్లి చేసుకోవాలనే కోరికతో, ప్రియుడితో కలిసి మూడో భర్తను అంతం చేసింది. ఈ కేసులో సదరు మహిళను, ఆమె ప్రియుడిని, మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే.. ఇది నర్సింగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకున్న దారుణం. జూన్ 27, 28 తేదీల మధ్య రాత్రి, హనుమాన్ వార్డులో నివాసం ఉంటున్న సరోజ్ మెహ్రా.. తన ప్రియుడు మహేంద్ర మెహ్రా, అతని అనుచరుడు విష్ణుతో కలిసి భర్త తులసీరామ్‌ను అడ్డుతొలగించుకుంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల విచారణలో సరోజ్ మెహ్రాకు 2004లో మొదటి వివాహం జరిగినట్లు తేలింది. మొదటి భర్తతో విభేదాలు రావడంతో రెండో పెళ్లి చేసుకుంది. రెండో భర్త మరణానంతరం, 2006లో తులసీరామ్‌ను మూడో వివాహం చేసుకుంది. ఇదే క్రమంలో మహేంద్ర మెహ్రాతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. సరోజ్ ఇప్పుడు మహేంద్రను నాలుగో పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకే ఇద్దరూ కలిసి తులసీరామ్‌ను అంతం చేశారని పోలీసులు తెలిపారు.

‘నన్ను దక్కించుకోవాలనే నా ప్రియుడు ఇలా చేశాడు’ నిందితురాలు సరోజ్ మెహ్రా మాత్రం తాను నిర్దోషినని వాదిస్తోంది. తన ప్రియుడు తనను దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇదంతా చేశాడని ఆమె పోలీసులకు తెలిపింది. తులసీరామ్‌ను హత్య చేస్తున్న సమయంలో సరోజ్ ఇంట్లోనే ఉంది. అయితే, దర్యాప్తులో లభించిన సాంకేతిక ఆధారాలు (టెక్నికల్ ఎవిడెన్స్), విచారణ ద్వారా ముగ్గురు నిందితుల కుట్ర బట్టబయలైందని పోలీసులు తెలిపారు.

భర్త అదృశ్యమైన తర్వాత సరోజ్ మూడు రోజుల పాటు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, కనీసం అతడిని వెతికే ప్రయత్నం కూడా చేయలేదని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రిషికేష్ మీనా తెలిపారు. దీంతో పోలీసులకు ఆమెపై అనుమానం బలపడింది. విచారణ, సాంకేతిక ఆధారాలతో ఈ కుట్రకు సంబంధించిన పూర్తి క్రమం వెలుగులోకి వచ్చింది.


Posted

in

by

Tags: