విదేశీ మహిళలతో చైనా పౌరులు చేసుకుంటున్న అక్రమ వివాహాలు పెరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని, చైనా ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
చైనా పౌరులు పాకిస్థాన్ లేదా ఇతర విదేశాలకు చెందిన మహిళలను పెళ్లి చేసుకోవడం వల్ల భారీగా ఆర్థిక నష్టాలు, ఎన్నో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని షింటియన్ కౌంటీ పోలీసులు హెచ్చరించారు.
ఇటీవలి కాలంలో యువత ఏజెంట్ల వలలో పడి, ఎలాంటి భావోద్వేగ అనుబంధం లేకుండా చేసుకుంటున్న ఇటువంటి వివాహాల వల్ల తీవ్ర మోసాలు, కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.
అంతేకాకుండా, అక్రమ మార్గాల్లో జరిగే వివాహాల సమాచారం తెలిస్తే కఠినమైన మోసం (ఫ్రాడ్) కేసులు నమోదు చేస్తామని, విదేశీ మహిళలకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ చట్టాల ఉల్లంఘనలు, భవిష్యత్తులో పిల్లల సంరక్షణ (కస్టడీ) హక్కుల విషయంలో తీవ్ర సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు.
నిబంధనలకు లోబడి, నిజమైన ప్రేమ-అనుబంధాల ఆధారంగా మాత్రమే వివాహాలు జరగాలని, ఇమ్మిగ్రేషన్ చట్టాలను ప్రజలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply