తమిళనాడు నీలగిరి జిల్లా గూడలూరులోని ఒక ప్రైవేట్ పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంకే ఎంపీ ఏ. రాజా, గూడలూరు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే పొన్ జయశీలన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ… “మేధావంతులైన పౌరులను తీర్చిదిద్దడంలో పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తాయి. నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా మంది విద్యార్థినులను ‘మీరు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారు?’ అని అడిగాను. వారు డాక్టర్, పైలట్ లేదా వైమానిక దళంలో చేరతామని చెబుతారు కానీ, రాజకీయ నాయకులం అవుతామని ఎవరూ చెప్పరు. అయితే విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.” అని పిలుపునిచ్చారు.
“ఇక్కడ ఉన్న పిల్లలందరూ ప్రేమగా, ఆప్యాయంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఏది ఇష్టమో అదే చేయండి” అని ఆయన తెలిపారు.
కురుస్తున్న వర్షంలో తడుస్తూనే రాహుల్ విద్యార్థులతో ముచ్చటించారు. అప్పుడు ఒక విద్యార్థిని “నీకు ఏది సవాలుగా అనిపిస్తోంది?” అని రాహుల్ ప్రశ్నించగా, ఆ విద్యార్థి “ఈ వర్షం” అని సమాధానం ఇవ్వడంతో రాహుల్ నవ్వేశారు.
అనంతరం మరో విద్యార్థినితో మాట్లాడుతూ… “పాఠశాలలో నేను ఎప్పుడూ లోకువగా ఉండే విద్యార్థిని కాదు. నన్ను హ్యాండిల్ చేయడం ఉపాధ్యాయులకు చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే నేను ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూనే ఉండేవాడిని” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
