పాత ఫోన్‌ను చెత్త అని పడేస్తున్నారా..? ఒక్క నిమిషం.! అందులో ఉండే కెమెరా కిలో రూ. 2.5 లక్షలా..? అసలు నిజమేంటో తెలుసా..?

చాలామంది పాత స్మార్ట్‌ఫోన్‌లను చెత్త అనుకుని పారేస్తుంటారు. కానీ, వాటిలోని కొన్ని విడిభాగాలకు రీసైక్లింగ్ మార్కెట్‌లో మంచి విలువ ఉందని సమాచారం.

ముఖ్యంగా పాత సెల్‌ఫోన్ కెమెరా మాడ్యూళ్లు కిలోకు రూ. 2.5 లక్షల వరకు అమ్ముడుపోతున్నాయని సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

పాత సెల్‌ఫోన్‌ల నుంచి కెమెరా, బ్యాటరీ, మదర్‌బోర్డు వంటి వివిధ భాగాలను వేరుచేస్తారు. వాటిలో కొన్ని భాగాలను మళ్లీ వినియోగిస్తారు, మరికొన్నింటిని రీసైక్లింగ్ కోసం విక్రయిస్తారు.

సెల్‌ఫోన్ కెమెరా, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాల్లో అతి తక్కువ మోతాదులో బంగారం వంటి విలువైన లోహాలు ఉండవచ్చు. కనెక్టర్లు, పిన్ కాంటాక్ట్స్ వంటి సూక్ష్మమైన ప్రదేశాలలో బంగారాన్ని ఉపయోగించడానికి ప్రధాన కారణం.. దాని విద్యుత్ వాహకత (conductivity), అలాగే తుప్పు పట్టని స్వభావం.

అయితే, కెమెరా వ్యర్థాలన్నీ కిలో రూ. 2.5 లక్షలకు అమ్ముడుపోతాయనేది అధికారికంగా ధ్రువీకరించబడలేదు. కెమెరా రకం, నాణ్యత, సెల్‌ఫోన్ మోడల్, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధర మారుతుంది. కాబట్టి పాత ఫోన్‌లో బంగారం ఉన్నంత మాత్రాన అది లక్షల రూపాయలకు అమ్ముడుపోతుందని పొరబడకూడదు.


Posted

in

by

Tags: