సుమారు రూ. 2 లక్షల విలువైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ను ఇంటి వద్ద నిలిపి ఉంచిన ఓ యజమాని, 6 నెలల తర్వాత వచ్చి బైక్‌ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగా అది ఎంతకీ స్టార్ట్ కాలేదు.
అనుమానం వచ్చి బైక్ ఇంజిన్, బాడీ భాగాలను విప్పి పరిశీలించగా, ఇంజిన్ లోపల ఎలుకలు ఏకంగా గూడు కట్టుకుని, పిల్లను పెట్టి సంసారం చేస్తున్న దృశ్యం కనిపించడంతో అతడు నివ్వెరపోయాడు. అంతేకాకుండా, ఆ ఎలుకలు బైక్‌లోని కీలకమైన వైరింగ్ మొత్తాన్ని కొరికి పాడుచేయడంతో, దాన్ని బాగు చేయడానికి రూ. 5,000 నుంచి రూ. 7,000 వరకు ఖర్చు అయింది.
అయితే, బైక్‌కు అంత పెద్ద మొత్తంలో నష్టం కలిగించినప్పటికీ, ఆ యువకుడు ఆవేశపడకుండా ఆ ఎలుకలను గానీ, వాటి పిల్లలను గానీ చంపకుండా చాలా జాగ్రత్తగా బయటకు తీసి సురక్షితమైన ప్రదేశంలో విడిచిపెట్టాడు. మూగజీవులపై ఆ యువకుడు చూపిన మానవత్వాన్ని, దయాగుణాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Leave a Reply