“పాపం ఆ పసిపాప.” స్కూల్లో స్నేహితులతో ఆడుకున్న చివరి క్షణం. విషపాము కాటుకు బలైన విషాదం.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు.!!

తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాలోని ఎక్నాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో ఒక తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

అక్కడి ఒక తరగతి గదిలో కూర్చుని 3వ తరగతి చదువుతున్న రంజిత్ (8) అనే బాలుడిని, ఊహించని విధంగా లోపలికి ప్రవేశించిన ఒక విషపాము కాటువేసింది. వెంటనే రక్షించిన ఆ విద్యార్థిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, విషం శరీరం అంతటా పాకిపోవడంతో ఆ బాలుడు రంజిత్ చికిత్స ఫలించక పరితాపకరంగా మృతి చెందాడు. ప్రభుత్వ పాఠశాల నిర్వహణ లోపం, నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ, ఆగ్రహించిన బాలుడి తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ప్రధాన ద్వారం ముందు గుమిగూడి తీవ్రంగా ఆందోళన చేపట్టడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *