“పారిస్‌ను వదిలేసి ముంబైకి వచ్చిన 23 ఏళ్ల యువకుడు..!” 3 వారాల్లోనే నేర్చుకున్న పాఠాలు.. సూటిగా ప్రశ్నించిన నెటిజన్లకు ఫ్రెంచ్ కుర్రాడి అదిరిపోయే సమాధానం.. వైరల్ వీడియో..!!

ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఫైనాన్స్ రంగంలో మంచి ఉద్యోగావకాశాల కోసం, భారతీయ సంస్కృతిని దగ్గరగా తెలుసుకోవడం కోసం నికో (23) అనే ఫ్రెంచ్ యువకుడు సుమారు 7,000 కిలోమీటర్లు ప్రయాణించి ముంబై నగరానికి వచ్చాడు.

ముంబైకి వచ్చి కేవలం 3 వారాలే అయినప్పటికీ, ఈ ‘మాయానగరం’ తనకు నేర్పిన ఆసక్తికర అనుభవాలను అతడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

పారిస్ నుంచి ముంబై వచ్చే ముందు తనకు ఎవరూ చెప్పని మూడు కీలక విషయాల గురించి ప్రస్తావిస్తూ అతడు పెట్టిన పోస్టులో.. ప్రధానంగా ముంబై ట్రాఫిక్ గురించి మాట్లాడాడు. “ముంబైలో ఎవరైనా గమ్యస్థానం కేవలం 5 కిలోమీటర్ల దూరమే ఉందని చెబితే వెంటనే సంబరపడిపోకూడదు. ఆ 5 కిలోమీటర్లు దాటడానికి అరగంట పడుతుందో లేక అంతకంటే ఎక్కువే పడుతుందో ఎవరికీ తెలియదు” అని తన అనుభవాన్ని రాసుకొచ్చాడు.

అలాగే, ముంబైలో ఒక రోజును ప్లాన్ చేసుకోవడం అంటే కేవలం ఆఫీస్ పనితో ముగిసిపోదని.. ఏ రూట్‌లో వెళ్ళాలి, ఎంత ట్రాఫిక్ ఉంటుంది, దారిలో ఏ టీ కొట్టు దగ్గర ఆగి టీ తాగాలి అనే విషయాల వరకు ప్రతిదీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తోందని నికో పేర్కొన్నాడు. ముంబైలోని ఉక్కపోత, ఎండ, రోడ్డు పక్కన లభించే టీ మరియు స్థానిక వంటకాలు ఇప్పుడు తన దైనందిన జీవితంలో భాగమైపోయాయని చెప్పాడు.

పారిస్‌లో అలవాటైన జీవనశైలితో పోలిస్తే.. ముంబైలోని రద్దీ, శబ్దాలు, ఉరుకుల పరుగుల జీవన విధానం వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అతడు తెలిపాడు. ప్రతిరోజూ కొత్త ప్రదేశాలను అన్వేషించడం, దారితప్పి కొత్త వ్యక్తులతో మాట్లాడటం, హిందీ మరియు మరాఠీ భాషలు నేర్చుకోవడానికి ప్రయత్నించడం చేస్తూ తన జీవితాన్ని ఉత్సాహంగా గడుపుతున్నాడు.

పారిస్ లాంటి అద్భుతమైన నగరాన్ని వదిలి ముంబైకి ఎందుకు వచ్చావని కొందరు నెటిజన్లు ప్రశ్నించగా.. “ఇక్కడి సంస్కృతిని స్వయంగా అనుభవించడానికి, కెరీర్ పరమైన ఎదుగుదల కోసమే ఇక్కడికి వచ్చాను” అని నికో స్పష్టంగా బదులిచ్చాడు. ట్రాఫిక్, ఎండ లాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, 3 వారాల్లోనే ఈ నగరం తనను ఎంతగానో ఆకట్టుకుందని, ముంబైలోని వేడివేడి టీ, ఇక్కడి ప్రజల ఆప్యాయత తన మనసును గెలుచుకున్నా


Posted

in

by

Tags: