అమెరికా సహా పాశ్చాత్య దేశాలు విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షల మధ్య, ఇరాన్ తన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి బిట్‌కాయిన్ మైనింగ్‌ను అతిపెద్ద ఆర్థిక ఆయుధంగా మార్చుకుంది.
ఇరాన్లో విద్యుత్ ఛార్జీలు చాలా తక్కువగా ఉండటంతో, సుమారు $1,300 ఖర్చుతో ఒక బిట్‌కాయిన్‌ను ఆ దేశం సృష్టించగలుగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర $73,000కి చేరువలో ఉండటంతో, ఒక్కో నాణేంపై దాదాపు $70,000 వరకు లాభం వస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ అయిన ‘స్విఫ్ట్’ (SWIFT) సహాయం లేకుండానే, డిజిటల్ వాలెట్ల ద్వారా సరిహద్దులు దాటి కోట్లాది రూపాయలను ఇరాన్ చేరవేస్తోంది.
క్రిప్టో మార్కెట్లో ఇరాన్ దూకుడు
బ్లాక్‌చెయిన్ విశ్లేషణ సంస్థ ‘చెయిన్ అనాలిసిస్’ (Chainalysis) సమాచారం ప్రకారం, ఇరాన్ క్రిప్టో మార్కెట్ 2025 నాటికి సుమారు $7.78 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ముఖ్యంగా ఫిబ్రవరి చివరి మరియు మార్చి ప్రారంభంలో ఇరాన్‌కు చెందిన అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీల నుండి సాధారణం కంటే 8 రెట్లు వేగంతో $10.3 మిలియన్ల నిధులు బయటకు వెళ్లినట్లు బ్లాక్‌చెయిన్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ ఆకస్మిక కదలికలు ఇరాన్ రహస్య ఆర్థిక లావాదేవీలను బయటపెట్టాయి.
ప్రపంచవ్యాప్త ఆంక్షలను ధిక్కరించడానికి డిజిటల్ కరెన్సీలు ఒక బలమైన భౌగోళిక రాజకీయ సాధనంగా మారడం రక్షణ నిపుణులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Leave a Reply