చిన్నపిల్లలు బహిరంగ ప్రదేశాల్లో పదేపదే తమ ప్రైవేట్ భాగాలను తాకడం లేదా లాగడం వంటివి చేసినప్పుడు తల్లిదండ్రులు చాలా ఇబ్బందిగా (ఎంబరాసింగ్‌గా) భావిస్తుంటారు.
దీని గురించి డాక్టర్ నిమిషా అరోరా మాట్లాడుతూ.. నాలుగు నుండి ఆరు నెలల వయసున్న పిల్లలలో ఈ ప్రవర్తన చాలా సాధారణమని చెప్పారు. పిల్లలు తమ కళ్ళు, ముక్కు లేదా చెవులను ఎలాగైతే తాకి చూస్తారో, ఇది కూడా అటువంటి శారీరక అన్వేషణ (Body Exploration) ప్రయత్నమేనని ఆమె వివరించారు.
తల్లిదండ్రులు చేయవలసినవి మరియు చేయకూడనివి:
- తిట్టవద్దు: ఇలాంటి సమయంలో పిల్లలను తిట్టడం లేదా అవమానించడం వల్ల వారి మనస్సులో అనవసరమైన నేర భావన (Guilt) కలుగుతుందని డాక్టర్ హెచ్చరిస్తున్నారు.
- సరైన పేర్లు: పిల్లలు కొంచెం పెద్దయ్యాక శరీర భాగాలకు ఉండాల్సిన సరైన పేర్లను వారికి నేర్పించాలి.
- ధ్యాస మళ్ళించడం: బహిరంగ ప్రదేశాల్లో పిల్లలు ఇలా చేస్తున్నప్పుడు, కంగారు పడకుండా లేదా వారిపై కోప్పడకుండా.. వారికి ఏదైనా బొమ్మ ఇచ్చి లేదా మాటల్లో పెట్టి వారి ధ్యాసను వేరే వైపు మళ్ళించడం సరైన పరిష్కారం.
- పరిశుభ్రత గమనించండి: ఒక్కోసారి దురద లేదా ఇన్ఫెక్షన్ వల్ల కూడా పిల్లలు అలా చేయవచ్చు. కాబట్టి ఆ భాగాల్లో ఎరుపుదనం లేదా దద్దుర్లు ఉన్నాయేమో ఒకసారి గమనించడం మంచిది.
