“పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయింది!” ఆస్తి రాసిచ్చిన అత్త… మరుసటి రోజే మరిది తో పరారైన కోడలు! న్యాయం కోసం పోరాడుతున్న భర్త!!

బీహార్ రాష్ట్రం జముయ్ ప్రాంతానికి చెందిన విశాల్ కుమార్ తల్లికి భూమి స్వంతంగా ఉండేది.

అనారోగ్యంతో ఉన్న తల్లి, తను చనిపోయే ముందు ఆ భూమిని తన కుమారుడైన విశాల్ పేరిట రాయాలని అనుకుంది. అయితే, తహసీల్దార్ కార్యాలయంలోని ఒక దళారీ , “కొడుకు పేరిట రిజిస్ట్రేషన్ చేయడం కంటే కోడలి పేరిట చేస్తే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ రుసుము చాలా వరకు తగ్గుతుంది” అని సలహా ఇచ్చాడు. ఆ రుసుము ఆదా అవుతుందనే ఆశతో విశాల్ కుటుంబసభ్యులు కూడా ఆ భూమిని అతని భార్య మమతా కుమారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.

తీరా ఆస్తికి సంబంధించిన పత్రాలు చేతికి వచ్చిన మరుసటి రోజే, మమతా కుమారి తన భర్త తమ్ముడితో (మరిదితో) కలిసి ఇల్లు వదిలి పారిపోయింది. అంతేకాకుండా, తన ఇద్దరు పిల్లలను (కుమారుడు, కుమార్తె) కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయింది.

అటు ఆస్తి పోయి, ఇటు కుటుంబం దూరమవ్వడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన విశాల్ కుమార్, ప్రస్తుతం చేతిలో కేవలం ఆస్తి పత్రాలు పట్టుకుని తనకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.


Posted

in

by

Tags: