“పుష్ప సినిమా స్టైల్‌లో..” వరదలో కొట్టుకుపోయిన 3000 గ్యాస్ సిలిండర్లు.. వైరలవుతున్న వీడియో..!!

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా, పన్వేల్ తాలూకాలో కురిసిన భారీ వర్షాల కారణంగా, అక్కడ ఉన్న హెచ్‌పీసీఎల్ (HPCL) గ్యాస్ సిలిండర్ ఫిల్లింగ్ ప్లాంట్‌లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది.

దీనివల్ల, ప్లాంట్‌లో నిల్వ ఉంచిన సుమారు 3,000 ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇవి సమీపంలోని పాతలగంగా నది మరియు ఖాన్‌పూర్ తండా కాలువలో ప్రమాదకరమైన రీతిలో కొట్టుకుపోతున్నాయి.

సినిమాల్లో కలప దుంగలు నదిలో కొట్టుకుపోతున్నట్లుగా, వేల సంఖ్యలో సిలిండర్లు వరద నీటిలో వేగంగా కొట్టుకుపోతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా అందరూ షాక్‌కు గురయ్యారు. ఆ నదిలో కొట్టుకుపోతున్న సిలిండర్లలో గ్యాస్ ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. కాబట్టి, ఎవరూ ఉత్సాహంతో వాటిని తాకవద్దని లేదా ఇంటికి తీసుకెళ్లవద్దని, ఇటువంటి ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండి వెంటనే అధికారులకు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.


Posted

in

by

Tags: