పెద్ద వార్త! ఇకపై సామాన్యులకు కూడా లగ్జరీ కార్లు అందుబాటులోకి.. ధరలు భారీగా తగ్గింపు!

భారత్ మరియు యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చివరి దశకు చేరుకుంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే భారతదేశంలో కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

ఈ డీల్‌లో విశేషమేమిటి? ప్రస్తుతం యూరప్ నుండి భారతదేశానికి దిగుమతి అయ్యే కార్లపై దాదాపు 110 శాతం టారిఫ్ (దిగుమతి సుంకం) ఉంది. అయితే, ఈ కొత్త ఒప్పందం ప్రకారం ఈ సుంకాన్ని 40 శాతానికి, మరికొన్ని కంపెనీలకు ఏకంగా 10 శాతానికి తగ్గించాలని భారత్ ప్రతిపాదించింది. దీనివల్ల యూరప్‌కు చెందిన మెర్సిడెస్ బెంచ్ (Mercedes), వోక్స్‌వ్యాగన్ (Volkswagen), ఆడి (Audi) వంటి లగ్జరీ కార్ల ధరలు భారత్‌లో భారీగా తగ్గనున్నాయి.

భారతదేశానికి కలిగే ప్రయోజనం ఏమిటి? యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాలతో వాణిజ్యం పెరగడం వల్ల భారత ఎగుమతులు భారీగా పెరుగుతాయి. ముఖ్యంగా భారతదేశంలో తయారయ్యే వస్త్రాలు, ఆభరణాలు (Gems & Jewelry), ఇంజనీరింగ్ వస్తువులకు యూరప్‌లో పెద్ద మార్కెట్ లభిస్తుంది. ఈ ఒప్పందం వల్ల భారతీయ వస్తువులపై యూరప్ విధించే పన్నులు కూడా తగ్గుతాయి. ఈ భారీ ఒప్పందాన్ని ఆర్థిక నిపుణులు “మదర్ ఆఫ్ ఆల్ డీల్స్” అని పిలుస్తున్నారు.


Posted

in

by

Tags: