“పెన్ను, కీచైన్ రూపంలో స్పై కెమెరాలు..” ప్రధానోపాధ్యాయుడి వికృత చేష్టలు.. కనిపెట్టిన సెక్యూరిటీ గార్డు.. కెమెరా యాంగిల్ సరిచేస్తూ అడ్డంగా దొరికిపోయిన వీడియో వెలుగులోకి.!!

అమెరికాలోని వెస్ట్ వర్జీనియా రాష్ట్రంలో ఉన్న బ్రూక్ హైస్కూల్ (Brooke High School) ప్రధానోపాధ్యాయుడిగా ఎరిక్ జేమ్స్ (53) పనిచేస్తున్నాడు.

ఈయన 2023 నుంచి ఈ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో, బాలికల వ్యాయామశాల (జిమ్) డ్రెస్సింగ్ రూమ్ మరియు డ్యాన్స్ టీమ్ దుస్తులు మార్చుకునే గదుల్లో పెన్ను, కీచైన్ రూపంలో ఉన్న 4 స్పై కెమెరాలను (రహస్య రికార్డింగ్ పరికరాలు) అమర్చిన విషయాన్ని ఓ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు.

దీనిపై అందిన ఫిర్యాదు మేరకు షెరీఫ్ డిపార్ట్‌మెంట్ మరియు పోలీసులు పాఠశాలకు చేరుకుని విస్తృత తనిఖీలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న కెమెరాల్లోని వీడియో ఫుటేజీని పరిశీలించగా.. ప్రధానోపాధ్యాయుడు ఎరిక్ జేమ్స్ కెమెరా లెన్స్‌ను నేరుగా చూస్తూ, నేలపై పెట్టి దాని యాంగిల్‌ను సరిచేస్తున్న దృశ్యాలు రికార్డై ఉన్నట్లు బయటపడింది. దీంతో పోలీసులు ఎరిక్ జేమ్స్‌ను తక్షణమే అరెస్టు చేసి జైలుకు తరలించారు. పాఠశాల యాజమాన్యం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేయగా, జిల్లాలోని ఇతర పాఠశాలల్లోనూ తనిఖీలను ముమ్మరం చేశారు.


Posted

in

by

Tags: