“పెళ్లయిన 45 రోజులకే నరకంగా మారిన జీవితం!” హనీమూన్‌లో భయానక దృశ్యం.. పీరియడ్స్ వచ్చాయని భార్యపై విచక్షణారహితంగా దాడి చేసిన భర్త.. తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటన.!!”

హనీమూన్ కోసం అండమాన్ దీవులకు వెళ్లిన నవదంపతుల మధ్య జరిగిన ఒక అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

వివాహం జరిగి కేవలం 45 రోజులే అయినప్పటికీ, హనీమూన్ అనుభవం ఆ నవవధువుకు ఒక నరకంగా మారిపోయింది.

అండమాన్‌లోని ఒక హోటల్ గదిలో బస చేసిన సమయంలో భార్యకు నెలసరి (పీరియడ్స్) వచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త, ఏమాత్రం కనికరం లేకుండా భార్య ముఖం, శరీరంపై పిడిగుద్దులు, కాళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా.. ఆమె గొంతు నులిమి చంపేందుకు కూడా ప్రయత్నించాడు.

హోటల్ గది నుంచి వచ్చిన ఆర్తనాదాలు విని పరుగున వచ్చిన సిబ్బంది, వెంటనే జోక్యం చేసుకుని ఆ మహిళను కాపాడారు. హోటల్ సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించడం వల్లే ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఈ దాడి అనంతరం బాధితురాలు గోరఖ్‌పూర్ చేరుకుని ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు భర్తతో పాటు మరో ముగ్గురు అత్తింటి వారిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

ప్రకృతి సహజమైన రుతుక్రమాన్ని (నెలసరిని) కారణంగా చూపి ఒక మహిళపై జరిగిన ఈ పాశవిక దాడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.


Posted

in

by

Tags: