పెళ్లి పేరుతో మోసం.. మహమ్మద్ షమీ సోదరుడిపై తీవ్ర ఆరోపణలు, యువతి సంచలన విషయాలు వెల్లడి

భారత క్రికెటర్ మహమ్మద్ షమీ తమ్ముడు మహమ్మద్ కైఫ్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కైఫ్ తనను మోసం చేశాడని ఒక మహిళ సంచలన ఆరోపణలు చేసింది.

పెళ్లి ప్రస్తావన రాగానే కైఫ్ సాకులు చెప్పడం మొదలుపెట్టాడని ఆ మహిళ ఆరోపించింది. వివరాల్లోకి వెళ్తే.. ఇమ్రాన్ అనే ఉమ్మడి స్నేహితుడి ద్వారా తనకు మహమ్మద్ కైఫ్ పరిచయమయ్యాడని ఆమె తెలిపింది. ఒకరోజు అనుకోకుండా జరిగిన సమావేశం స్నేహంగా మారి, ఆపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఛాటింగ్ ద్వారా వారి మధ్య సంబంధం (రిలేషన్) మొదలైందని వివరించింది. అయితే, ఈ బంధం ఎందుకు తెగిపోయిందో తనకు ఇప్పటికీ కారణం తెలియదని ఆమె పేర్కొంది.

పెళ్లి మాట ఎత్తగానే..
మహమ్మద్ కైఫ్‌పై ఆరోపణలు చేస్తూ.. పెళ్లి గురించి మాట్లాడగానే అతను దూరం జరగడం ప్రారంభించాడని ఆమె చెప్పింది. కైఫ్ ఈ బంధంలో కొనసాగడం ఇష్టం లేకపోయినా, స్పష్టమైన సమాధానం చెప్పకుండా తనను మోసగించాడని ఆ మహిళ వాపోయింది. కైఫ్‌ను నేరుగా ‘మోసగాడు’ అని ఆమె సంబోధించింది. సంబంధం గురించి ‘అవును’ లేదా ‘కాదు’ అని తేల్చి చెప్పమని అడిగితే, ఒక రోజు సమయం కావాలని అడిగాడని.. అప్పటి నుండి వారి మధ్య విభేదాలు మొదలయ్యాయని వెల్లడించింది.

వృత్తిరీత్యా క్రికెటర్
తన అన్న మహమ్మద్ షమీ లాగే మహమ్మద్ కైఫ్ కూడా వృత్తిరీత్యా క్రికెటర్. భారత దేశవాళీ క్రికెట్‌లో అతను బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన కైఫ్, తన 14 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల కెరీర్‌లో 43 వికెట్లు పడగొట్టాడు. అలాగే 9 లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 12 వికెట్లు తీశాడు.


Posted

in

by

Tags: