‘పొరపాటున జరిగిపోయింది.’ లక్నోలో తండ్రిని ముక్కలు ముక్కలు చేసిన కుమారుడు – ఆ సమాధానం విని పోలీసులు షాక్.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక కుమారుడు తన తండ్రిని ముందుగా కాల్చి చంపి, ఆపై మృతదేహాన్ని ముక్కలు చేసి నీలిరంగు డ్రమ్ములో దాచిపెట్టాడు. నిందితుడు అక్షత్ అరెస్ట్ అయిన తర్వాత, తన తండ్రిని ఎందుకు చంపాడో చెప్పిన కారణం విని అందరూ విస్తుపోయారు.

పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరిస్తూ, అది “పొరపాటున జరిగిపోయింది” అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఈ మాట విని అంతా నివ్వెరపోయారు. నిందితుడి ప్రవర్తన ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, అత్యంత అమానుషంగా ఉందని పోలీసులు తెలిపారు.

అసలు ఏం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం, లక్నోకు చెందిన 21 ఏళ్ల అక్షత్ పై అతని తండ్రి NEET పరీక్ష పాస్ కావాలని నిరంతరం ఒత్తిడి తెచ్చేవాడు. ఆ కోపంలో ఒకరోజు అక్షత్ తన తండ్రి లైసెన్స్డ్ రైఫిల్ తీసి ఆయన్ని కాల్చి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి మూడవ అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్‌కు లాక్కొచ్చి, ముక్కలుగా నరికాడు. కొన్ని శరీర భాగాలను కారులో తీసుకెళ్లి సద్రౌనాలో పడేయగా, మొండెం భాగాన్ని ఇంట్లోని ప్లాస్టిక్ డ్రమ్ములో దాచాడు. ఈ ఘటన జరిగినప్పుడు అక్షత్ సోదరి ఇంట్లోనే ఉన్నప్పటికీ, ఆమెను భయపెట్టి నోరు మూయించాడు.

పోలీసుల విచారణ

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, అక్షత్ ఫిబ్రవరి 20న తన తండ్రి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే, సోమవారం సాయంత్రం ఇంట్లో నుండి దుర్వాసన వస్తుండటంతో పోలీసులు సోదాలు నిర్వహించి, డ్రమ్ములో ఉన్న శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అక్షత్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని యాసిడ్‌తో కాల్చేందుకు కూడా సిద్ధమయ్యాడని, ఇందుకోసం బ్లింకిట్ (Blinkit) ద్వారా కత్తులు ఆర్డర్ చేశాడని, రంపం స్వయంగా మార్కెట్ నుండి కొనుగోలు చేశాడని తెలిసింది. ప్రస్తుతం పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags: