చండీగఢ్: పంజాబ్లో చోటుచేసుకున్న ఒక వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 67 ఏళ్ల వృద్ధుడు, 19 ఏళ్ల యువతి ప్రేమించి పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి మధ్య దాదాపు 48 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, తాము గాఢంగా ప్రేమించుకున్నామని ఈ జంట చెబుతోంది.
పొలాల్లో రహస్య ప్రేమాయణం:
అందిన సమాచారం ప్రకారం.. ఆ యువతికి ఇదివరకే వివాహం జరిగినప్పటికీ, తన భర్తను వదిలేసి ఈ వృద్ధుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ గ్రామంలోని పొలాల్లో తరచుగా రహస్యంగా కలుసుకునేవారు. అయితే, వీరి రహస్య కలయికలను గమనించిన గ్రామస్థులు వీరి వ్యవహారాన్ని బయటపెట్టారు.
గ్రామంలోనే పెళ్లి – వింత వాదన:
గ్రామస్థులు వీరిద్దరినీ పట్టుకుని అక్కడికక్కడే వివాహం జరిపించినట్లు తెలుస్తోంది. వయసు వ్యత్యాసంపై ప్రశ్నలు తలెత్తగా.. “ప్రేమకు వయసుతో సంబంధం లేదు, వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే” అని ఈ జంట సమాధానమిచ్చింది. తాము కలిసే జీవించాలని నిర్ణయించుకున్నామని వారు స్పష్టం చేశారు.
రక్షణ కోరుతూ హైకోర్టుకు:
పెళ్లి తర్వాత తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన ఈ జంట పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఆ యువతి చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
“అతని ఒడిలో తల పెట్టుకుని పడుకోవడమే నాకు ఇష్టం. నా ఇష్టప్రకారమే ఈ బంధాన్ని ఎంచుకున్నాను” అని ఆమె తన ప్రేమను వ్యక్తం చేసింది.
