పోలీసు చేతిలో లాఠీ.. యువకుడిపై విచక్షణారహితంగా దాడి ..! అతడు చేసిన తప్పేంటో తెలియదు.. పోలీసు ఇలాగే కొట్టాలా..?

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతంలో ఓ యువకుడిపై పోలీసులు లాఠీతో దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో ఓ పోలీసు కానిస్టేబుల్ యువకుడిని లాఠీతో చితకబాదుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో వ్యవహారం డీసీపీ నరేంద్ర రావత్ దృష్టికి చేరింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన ఆదేశించారు.

పాన్ దుకాణం నడుపుతున్న ఆ యువకుడు మాట్లాడుతూ.. రావ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్ఐ అనూజ్ కుమార్ ఝా, ఆయన డ్రైవర్ నీలేష్ తనపై దాడి చేశారని ఆరోపించాడు. అంతేకాకుండా, తన వద్ద నుండి నెలకు రూ. 25,000 లంచం డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వడానికి నిరాకరిస్తే బూతులు తిడుతూ కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరించినట్లు కూడా యువకుడు ఆరోపించాడు.

అయితే, యువకుడు చేసిన ఈ ఆరోపణలు, వైరల్ అవుతున్న వీడియో ఇంకా అధికారికంగా ధ్రువీకరించబడలేదు. వీడియోలోని ఘటన ఏ పరిస్థితుల్లో జరిగింది? పోలీసులపై వచ్చిన ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు తెలిపారు.

ఈ అంశం డీసీపీ నరేంద్ర రావత్ దృష్టికి వెళ్లడంతో, సమగ్రంగా విచారించి వాస్తవాలను వెలికితీయాలని, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మరోవైపు, యువకుడిని పోలీసులు లాఠీతో కొడుతున్న వీడియో నెట్టింట తీవ్ర కలకలం రేపుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *