ప్రభుత్వ ఉద్యోగికి వింత పరిస్థితి..! 3 సార్లు అవకాశమిచ్చినా టైపింగ్ పాస్ కాలేదంట.. దానికోసం ఇలా చేస్తారా..? జూనియర్ క్లార్క్‌ను అటెండర్‌గా మార్చిన కలెక్టర్..!!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి వరుసగా 3 సార్లు టైపింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో, జూనియర్ క్లార్క్ హోదా నుండి డిమోట్ (పదవీ విరమణ/పని తగ్గించడం) చేసి అటెండర్ (ప్యూన్) ఉద్యోగానికి మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ చర్యను జిల్లా కలెక్టర్ అవినాష్ సింగ్ తీసుకున్నారు. ఒకే పరీక్షలో మూడుసార్లు వైఫల్యం చెందడంతోనే ఈ విధమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

రేహాన్ ఖాన్ అనే వ్యక్తి మీర్‌గంజ్ తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ క్లార్క్‌గా పనిచేస్తున్నారు. గత 2021 జులై 5వ తేదీన, మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులకు ఇచ్చే కారుణ్య నియామకం ద్వారా ఆయనకు ఈ ప్రభుత్వ ఉద్యోగం లభించింది. అయితే, ఆ ఉద్యోగంలో కొనసాగాలంటే హిందీ టైపింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరిగా మారింది.

దీంతో, 2023 సెప్టెంబర్ 25న మొదటిసారి టైపింగ్ పరీక్ష నిర్వహించారు. అందులో ఆయన పాస్ కాలేకపోయారు. ఆ తర్వాత 2024 జూన్ 21న రెండోసారి అవకాశం ఇచ్చినప్పటికీ విజయం సాధించలేకపోయారు. చివరిగా గత సెప్టెంబర్ 8న మూడోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. అందులోనూ నిర్ణయించిన వేగం, నాణ్యతా ప్రమాణాలను ఆయన అందుకోలేకపోయారు.

దీంతో సెప్టెంబర్ 16న జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేస్తూ, రేహాన్ ఖాన్‌ను జూనియర్ క్లార్క్ పదవి నుంచి ప్యూన్ (అటెండర్) ఉద్యోగానికి బదిలీ చేశారు. ఇదే రీతిలో మరికొందరు ఉద్యోగులకు కూడా టైపింగ్ పరీక్ష పాస్ అయ్యేందుకు సమయం ఇచ్చారు. కంప్యూటర్ టైపింగ్ నేర్చుకుని పరీక్షకు సిద్ధమవ్వడానికి వారికి రెండు నెలల వ్యవధి కల్పించారు. ఈ సమయం తర్వాత కూడా పురోగతి లేకపోతే, వారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *